వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Cow dung: ఆవు పేడ చోరీ అయ్యిందని ఎఫ్ఐఆర్, విలువ ఎంతో తెలుసా ?, మా ఖర్మ, ఎం చేస్తాం !

|
Google Oneindia TeluguNews

చత్తీస్ గడ్/ చెన్నై: కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో లాక్ డౌన్ విధించడంతో పోలీసులకు సెలవులు లేకపోవడంతో నానా తంటాలు, లేనిపోని ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో పోలీసుల మైండ్ బ్లాక్ అయ్యే విచిత్రమైన కేసులు వాళ్ల దగ్గరకు వెలుతున్నాయి. ఆవు పేడ చోరీ అయ్యిందని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారం రోజులు పాటు పోలీస్ స్టేషన్ చుట్టూ చెప్పులు అరిగిపోయేలా తిరిగిన ఆ వ్యక్తి చివరికి ఎఫ్ఐఆర్ నమోదు చేయించాడు. విదిలేని పరిస్థితుల్లో కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పుడు అన్నం నీళ్లు వదిలేసి మా ఖర్మ, ఏం చేద్దాం అంటూ ఆవు పేడ చోరీ చేసిన గుర్తు తెలియని వ్యక్తుల కోసం గాలిస్తున్నారు.

Illegal affair: భర్తను ఎలా చంపాలి ?, గూగుల్ లో వెతికి లేపేసింది, మొబైల్ కాల్ డేటాలో !Illegal affair: భర్తను ఎలా చంపాలి ?, గూగుల్ లో వెతికి లేపేసింది, మొబైల్ కాల్ డేటాలో !

ఆవు పేడ చోరీ అయ్యిందని కేసు

ఆవు పేడ చోరీ అయ్యిందని కేసు

చత్తిస్ గఢ్ లోని కార్బో జిల్లాలోని దురేనా గ్రామంలో మేము సేకరించిన 800 కేజీల ఆవు పేడ చోరీ అయ్యిందని ఆవులు పెంచుకుంటున్న కర్హాన్ సింగ్ కన్వర్ అనే వ్యక్తి డిప్కా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. జూన్ 8వ తేదీ రాత్రి మేము నిద్రపోయిన తరువాత ఆవుల షెడ్ పక్కన ఉన్న కుప్పలో ఉన్న ఆవు పేడను చోరీ చేశారని కర్హాన్ సింగ్ కనర్వ్ పోలీసు కేసు పెట్టాడు.

 పట్టువదలని విక్రమార్కుడు

పట్టువదలని విక్రమార్కుడు

జూన్ 15వ తేదీ వరకు వారం రోజులు పాటు పోలీస్ స్టేషన్ చుట్టూ చెప్పులు అరిగిపోయేలా తిరిగిన కర్హాన్ సింగ్ కన్వర్ చివరికి ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు. విదిలేని పరిస్థితుల్లో కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పుడు ఆవు పేడ చోరీ చేసిన వ్యక్తుల కోసం గాలిస్తున్నారు. చత్తిస్ గఢ్ లో ఆవు పేడ రైతుల దగ్గర కేజీ రూ. 2కు ఆ రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు చేస్తోంది.

చోరీ ఆయిన ఆవుపేడ విలువ ఎంతో తెలుసా ?

చోరీ ఆయిన ఆవుపేడ విలువ ఎంతో తెలుసా ?

రైతుల దగ్గర కొనుగోలు చేసిన ఆవుపేడను ఆ రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన ఎరువులు తయారు చేసి రైతులకు ఇస్తోంది. ఈ విదంగా మంచి నాణ్యమైన దిగుబడి రావడంతో రైతులు ఆవుపేడను జాగ్రతగా చూసుకుంటున్నారు. చోరీ అయిన 800 కేజీల ఆవు పేడ విలువ అక్షరాలా రూ. 1,600 అని, ఆవుపేడ చోరీ చేసిన దొంగల కోసం తాము గాలిస్తున్నామి దిప్కా పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ సురేష్ కుమా చెప్పారని ఏఎన్ఐ మీడియా స్పష్టం చేసింది.

Recommended Video

Telangana లో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న నకిలీ విత్తన తయారీ దారులు!!
మా ఖర్మ....... కేసు విచారణలో ఉంది

మా ఖర్మ....... కేసు విచారణలో ఉంది

మా ఖర్మకాలి ఇలాంటి కేసులు తెరమీదకు వస్తున్నాయని, లాక్ డౌన్ టైమ్ లో కూడా మాకు సెలవులు లేక ఇబ్బందులు పడుతుంటే ఇలాంటి కేసులు విచారణ చెయ్యాల్సి వస్తోందని స్థానిక పోలీసులు అసహనం వ్యక్తం చేస్తున్నారని సమాచారం. ఆరు నెలల పాటు ఆవుపేడను ఒకే చోట నిల్వచేస్తే మంచి ఎరువులు తయారు అవుతున్నాయి. నాణ్యమైన ఎరువులు తయారు చెయ్యడానికి, ప్రభుత్వానికి విక్రయించడానికి ఆవుపేడను స్థానిక ప్రజలు కంటికి రెప్పలా చూసుకుంటున్నారు.

English summary
Cow dung: The Chhattisgarh Police has filed a case against unknown persons after about 800 kilograms of cow dung worth Rs 1,600 was stolen from the Dhurena village of Chhattisgarh's Korba district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X