వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం కుమారస్వామి భార్య మీద పోటీకి సిద్దం: గతంలో ఆమెనే ఓడించారు, ఢీ, బీజేపీ ప్రతీకారం !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి చేతిలో ఓటిమిపాలైన బీజేపీ అభ్యర్థి సీపీ. యోగేశ్వర్ ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్దం అయ్యారు. రామనగర ఉప ఎన్నికల్లో కుమారస్వామి భార్య మీద పోటీ చెయ్యడానికి సీపీ. యోగేశ్వర్ సిద్దం అవుతున్నారు. అధికారికంగా బీజేపీ ప్రకటించనప్పటికీ సీపీ. యోగేశ్వర్ ఇప్పటి నుంచి రామనగర శాసన సభ నియోజక వర్గంలోని నాయకులతో చర్చలు జరుపుతున్నారు. గతంలో కుమారస్వామి భార్యను ఓడించిన సీపీ యోగేశ్వర్ మరోసారి ఎన్నికల్లో ఆమెను ఢీకొనడానికి సిద్దం అయ్యారు.

పాత మైసూరు

పాత మైసూరు

పాత మైసూరు ప్రాంతంలో ఒక్కలిగులు (గౌడ) ప్రభావం ఎక్కువ. ఒక్కలిగ వర్గానికి చెందిన సీపీ. యోగేశ్వర్ ను దూరం చేసుకోవడం ఇష్టం లేని బీజేపీ రామనగర శాసన సభ నియోజక వర్గం ఉప ఎన్నికల్లో ఆయన్నే పోటీ చేయించాలని నిర్ణయించిందని సమాచారం.

Recommended Video

కర్ణాటక బంద్ కు మిశ్రమ స్పంధన
కుమారస్వామికి పోటీ

కుమారస్వామికి పోటీ

కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి చెన్నపట్టణ శాసన సభ నియోజక వర్గం నుంచి పోటీ చేశారు. చెన్నపట్టణ శాసన సభ నియోజక వర్గంలో బీజేపీ అభ్యర్థిగా సీపీ. యోగేశ్వర్ పోటీ చేశారు. చెన్నపట్టణలో కుమారస్వామికి సీపీ. యోగేశ్వర్ గట్టిపోటీ ఇచ్చి చివరికి ఓడిపోయారు.

జేడీఎస్ కు అనుమానం

జేడీఎస్ కు అనుమానం

చెన్నపట్టణలో కుమారస్వామి విజయం అంత సులభంకాదని జేడీఎస్ పార్టీ సర్వేలో వెలుగు చూసింది. కుమారస్వామి ముందు జాగ్రత్తగా చెన్నపట్టణతో పాటు రామనగర శాసన సభ నియోజక వర్గం నుంచి పోటీ చేశారు. కుమారస్వామి చెన్నపట్టణతో పాటు రామనగర నియోజక వర్గంలో విజయం సాధించారు.

సీఎం రాజీనామా

సీఎం రాజీనామా

చెన్నపట్టణ నియోజక వర్గం పెట్టుకున్న సీఎం కుమారస్వామి రామనగర శాసన సభ నియోజక వర్గం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. రామనగర శాసన సభ నియోజక వర్గం నుంచి కుమారస్వామి భార్య అనితా కుమారస్వామి పోటీ చేస్తున్నారు.

అనితా కుమారస్వామి ఓటమి

అనితా కుమారస్వామి ఓటమి

2013 శాసన సభ ఎన్నికల్లో అనితా కుమారస్వామి చెన్నపట్టణ నుంచి పోటీ చేశారు. ఆ సందర్బంలో అనితా కుమారస్వామిని సీపీ. యోగేశ్వర్ ఓడించారు. ఇప్పుడు మళ్లీ రామనగర శాసన సభ నియోజక వర్గం నుంచి అనితా కుమారస్వామి, సీపీ యోగేశ్వర్ పోటీ చెయ్యడానికి సిద్దం అయ్యారు. రామనగరలో సీపీ యోగేశ్వర్ ఓడిపోతే ఆయన్ను ఎమ్మెల్సీ చెయ్యాలని బీజేపీ నాయకులు నిర్ణయించారని సమాచారం.

English summary
CP Yogeshwar may contest from Ramanagar by election from BJP ticket. He already lost in Chenpatna against Kumaraswamy. BJP want to give him more chance because he is the only Okkaliga community leader for BJP in Old Mysuru region.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X