సంచలన వీడియో; మమ్మల్ని కాపాడండి: వేడుకున్న బీజేపీ నేత కుమార్తె!(వీడియో)

Subscribe to Oneindia Telugu
  సంచలన వీడియో; మమ్మల్ని కాపాడండి: వేడుకున్న బీజేపీ నేత కుమార్తె!

  తిరువనంతపురం: కేరళలో ఎర్రన్నలకు.. కాషాయ దళానికి మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. సీపీఎం కార్యకర్తల మూలంగా తమ కుటుంబానికి ప్రాణ హాని ఉందంటూ ఓ బాలిక వీడియో తెర పైకి రావడం ఇప్పుడు రాష్ట్రంలో పెను దుమారం లేపుతోంది. సీపీఎం బెదిరింపులకు పాల్పడుతోందంటూ సోషల్ మీడియాలో బాలిక పోస్టు చేసిన వీడియో వైరల్‌గా మారింది.

   ఏం జరిగింది:

  ఏం జరిగింది:

  కసరగాడ్‌ జిల్లాకు చెందిన సుకుమారన్‌ అనే సీపీఎం కార్యకర్త.. ఇటీవలే పార్టీని వీడారు. పార్టీ తనను గుర్తించట్లేదన్న అసంతృప్తితో బీజేపీలో చేరిపోయారు. ఈ నేపథ్యంలోనే సీపీఎం సుకుమారన్‌‌పై కక్ష గట్టిందనేది అతని కుమార్తె అశ్విని ఆరోపణ. ఇదే విషయాన్ని ఆమె వీడియో రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

  చంపుతామని బెదిరించినట్టు ఆరోపణ..:

  చంపుతామని బెదిరించినట్టు ఆరోపణ..:

  గురువారం తన కూతురును స్కూల్‌ నుంచి తీసుకొస్తున్న క్రమంలో సుకుమారన్‌‌ను ఐదుగురు సీపీఎం కార్యకర్తలు అడ్డగిచ్చినట్టుగా ఆరోపణలు వచ్చాయి. సుకుమారన్‌ కుటుంబాన్ని చంపుతామని, పోలీసులు కూడా తమనేమి చేయలేరని వాళ్లు హెచ్చరించినట్టుగా చెబుతున్నారు. ఈ విషయాలన్నింటిని సుకుమారన్ కుమార్తె ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడం గమనార్హం.

   మమ్మల్ని కాపాడండి..:

  మమ్మల్ని కాపాడండి..:

  'స్కూల్‌కు వెళ్లాళ్లన్నానాకు భయంగా ఉంది.. దొడ్డిదారిలో పాఠశాలకు వెళ్లాల్సి వస్తోంది. సీపీఎం కార్యకర్తలు నా తండ్రిని చంపేస్తారు.. నా కుటుంబాన్ని రక్షించండి' అంటూ బాలిక వీడియోలో ఆవేదనవ వ్యక్తం చేసింది.

  ఖండించిన సీపీఎం:

  ఖండించిన సీపీఎం:

  'సుకుమారన్ లాంటి చిన్న స్థాయి వ్యక్తిని మేమెందుకు బెదిరిస్తాం. ఆ అవసరమేంటి?.. సీపీఎంలో అతనో సాధారణ కార్యకర్త. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఇప్పుడు బీజేపీలోకి వెళ్లాడు. పబ్లిసిటీ కోసమే ఈ ఆరోపణలన్ని చేయిస్తున్నాడు' అని సీపీఎం కొట్టిపారేసింది.

  బీజేపీ వాదన:

  మరోవైపు సుకుమారన్ బలమైన నేత అని బీజేపీ చెబుతోంది. కాబట్టే అతనికి బెదిరింపులు వస్తున్నాయని పేర్కొంది. బెదిరింపుల వెనుక ఎవరున్నారో నిగ్గు తేల్చాలని ధర్నా కూడా చేపట్టింది. సుకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  A class XI student and the daughter of a local BJP leader in Kasaragod district of Kerala has appealed for help in a Facebook video after CPM workers allegedly threatened to kill her father.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి