వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

థియేటర్లు , మల్టీ ప్లెక్స్ లను నిండా ముంచేసిన కరోనా లాక్ డౌన్..మూడు నెలల వరకు నో పర్మిషన్?

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్న మహమ్మారి . ఇండియాను వణికిస్తున్న ఈ మహమ్మారి అన్ని రంగాలను కుదేలు చేసింది. ఇక థియేటర్లను, మల్టీ పెక్స్ లను నిండా ముంచింది కరోనా లాక్ డౌన్ . భారతదేశ చలన చిత్ర పరిశ్రమ కరోనా లాక్ డౌన్ తో తీవ్రంగా దెబ్బ తిండి . కరోనావైరస్ మహమ్మారి నుండి ఆర్థికంగా కోలుకోవడానికి కనీసం రెండు సంవత్సరాలు పడుతుందని చలనచిత్ర పారిశ్రామిక వర్గాలు భావిస్తున్నాయి. ఇది వేలాది ఉద్యోగాలను ప్రమాదంలో పడేస్తుందని కూడా పేర్కొంది.

Recommended Video

Indian Film Industry, Theaters and Multiplexes in Financial Turmoil
ఆర్ధిక సంక్షోభంలో థియేటర్లు , మల్టీ ఫ్లెక్స్ లు

ఆర్ధిక సంక్షోభంలో థియేటర్లు , మల్టీ ఫ్లెక్స్ లు

ఇటీవల చలన చిత్ర పరిశ్రమ ఒక వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా చలనచిత్ర పరిశ్రమ ఎంతగా దెబ్బ తిందో చర్చించారు . భారత వాణిజ్య రాజధాని ముంబైలోని సినీ పరిశ్రమ అయిన బాలీవుడ్ నుండి డజను మంది అగ్రశ్రేణి నిర్మాతలు, పంపిణీదారులు మరియు నటీనటులు మాట్లాడుకున్నారు . కరోనా లాక్ డౌన్ దెబ్బకు ముందు ముందు ప్రజలు థియేటర్లకు రావటం కష్టమే అన్న భావన వ్యక్తం చేశారు . ఇక లాక్ డౌన్ ఎత్తివేసి థియేటర్లు నిర్వహించాల్సి వస్తే వారు ధరలను తగ్గించాల్సి ఉంటుంది వీక్షకులను ఆకర్షించటానికి అని కూడా ఒక అంచనా వేస్తున్నారు.

దేశ వ్యాప్తంగా 9,600 థియేటర్లు మూసివేత

దేశ వ్యాప్తంగా 9,600 థియేటర్లు మూసివేత

ఇక దేశ వ్యాప్తంగా సుమారు 9,600 థియేటర్లు మూసివేయబడ్డాయి మరియు మల్టీప్లెక్స్‌లు మరియు సింగిల్-స్క్రీన్ సినిమాహాళ్ళలో వ్యాపారం పూర్తిగా దెబ్బ తింది. కరోనా లాక్ డౌన్ తో థియేటర్లు మూత పడటం థియేటర్ యాజమాన్యాలను దివాలా తీయించే స్థితికి నెట్టింది .ఇక ఇండియాలో మరో రెండు,మూడు నెలలు థియేటర్లు తెరవకపోవచ్చు మరియు ఆగస్టు వరకు సాధారణ ఆక్యుపెన్సీ తిరిగి రాకపోవచ్చు కూడా అన్న భావన వ్యక్తమవుతుంది .

కరోనా తో సినిమాలపై జనాలకు తగ్గనున్న ఆసక్తి .. భారీ బడ్జెట్ సినిమాలు కష్టమే

కరోనా తో సినిమాలపై జనాలకు తగ్గనున్న ఆసక్తి .. భారీ బడ్జెట్ సినిమాలు కష్టమే

పరిశ్రమల గణాంకాలు భారతదేశం ఒక సాధారణ సంవత్సరంలో 1,200 సినిమాలు చేస్తాయని చూపిస్తుంది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో పెద్ద బడ్జెట్ సినిమాలు రాకపోవచ్చని అంటున్నారు. ఎందుకంటే బాక్సాఫీస్ ఆదాయాలు పడిపోతున్న తరుణంలో నిర్మాణ సంస్థలు ద్రవ్య సంక్షోభంతో పోరాడుతున్నాయి.ఇక ఈ సమయంలో భారీ బడ్జెట్ సినిమాలు కూడా రాకపోవచ్చు . థియేటర్లు తిరిగి తెరిచిన తరువాత కూడా చిన్న సినిమాలు మాత్రమే విడుదలయ్యే అవకాశం ఉంది.

150 మిలియన్ డాలర్లకు పైగా నష్టం... మరో మూడు నెలలు థియేటర్లకు నో పర్మిషన్

150 మిలియన్ డాలర్లకు పైగా నష్టం... మరో మూడు నెలలు థియేటర్లకు నో పర్మిషన్

దాదాపు ఇప్పటి వరకు 150 మిలియన్ డాలర్లకు పైగా నష్టం వాటిల్లిందని భావిస్తున్నారు .కరోనా తగ్గని క్రమంలో మరో రెండు, మూడు నెలల వరకు థియేటర్లు తెరిచేందుకు వాతావరణం సానుకూలంగా లేదనే భావన వ్యక్తం అవుతుంది . ఇక మల్టీప్లెక్స్ ల విషయంలో.. సామాజిక దూరం తప్పనిసరి కాబట్టి.. కొన్ని జాగ్రత్తల మధ్య సీటింగ్ విషయంలో మార్పులు చేసి తెరిచేందుకు ప్రతిపాదనలు ఉన్నా అది ఎంతవరకు సాధ్యం అవుతుంది అనేది పరిశీలిస్తున్నారు. ఏది ఏమైనా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన సినీ పరిశ్రమ అనుబంధ థియేటర్లు , మల్టీప్లెక్స్ లు మళ్ళీ మంచి రోజులు చూడాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉంది. అది కూడా కరోనా నివారణ సాధ్యం అయితేనే అన్న టాక్ వినిపిస్తుంది .

English summary
Corona Lockdown hit, people would have a hard time getting to the theater. There is a feeling that it will be difficult to open theaters for another three months. It is also predicted that theaters and multiplexes will be in financial turmoil.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X