అలా జరిగితే నేను కూడ ఆయనకు భజన చేస్తా, నోట్ల రద్దును నిరసిస్తూ వీడియో పోస్టు
పెద్ద నగదు నోట్ల రద్దుతో నల్లధనం నిర్మూలనకు గురైతే తాను కూడ ప్రధానమంత్రి నరేంద్రమోడీని కీర్తీస్తూ భజన చేస్తానని చెప్పారు డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.
న్యూఢిల్లీ :పెద్ద నగదు నోట్ల రద్దు తో నల్లధంన లేకుండా పోతే తాను మోడీ ని కీర్తిస్తూ భజన చేస్తానని డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఈ నిర్ణయం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ నాశనమైందన్నారు. పెద్ద నగదు నోట్ల రద్దు వల్ల రైతులు, వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
పెద్ద నగదు నోట్ల రద్దు నిర్ణయాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ అవకాశం దొరికినప్పుడల్లా మోడీపై విరుచుకుపడుతున్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. మోడీ తీసుకొనే నిర్ణయం వల్ల నల్లధనం నిర్మూలన తగ్గే అవకాశం ఉండదని ఆయన అభిప్రాయపడుతున్నారు.అవకాశం దొరికినప్పుడల్లా మోడీ నిర్ణయంపై విమర్శనాస్త్రాలను ఆయన ఎక్కుపెడుతున్నారు.

బవానాలో వ్యాపారులతో మాట్లాడుతున్న సమయంలో కొందరు మోడీకి అనుకూలంగా నినాదాలు చేయడంతో ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. మోడీ తీసుకొన్న నిర్ణయాలతో నల్లధనం నిర్మూలిస్తే తాను కూడ మోఢీని కీర్తిస్తూ భజన చేస్తానని ఆయన చెప్పారు.స్వఛ్చ భారత్, సర్జికల్ స్ట్రైక్స్ ను స్వాగతించాం, కాని, పెద్ద నగదు నోట్ల రద్దు వల్ల ప్రయోజనం ఉండదని దాన్ని వ్యతిరేకిస్తున్నట్టు ాయన చెప్పారు.
బ్యాంకుల నుండి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకొన్న ప్రధానమంత్రి సన్నిహితులకు మాత్రమే ఈ నిర్ణయం ప్రయోజనంగా ఉంటుందని అరవింద్ చెప్పారు. పెద్ద నగదు నోట్ల రద్దును ఎందకు రద్దుచేస్తున్నారో ఆయన ఓ వీడియోను సామాజిక మాథ్యమాల్లో పోస్టు చేశారు.












Click it and Unblock the Notifications