శుభవార్త: సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్‌కు ఏటా రూ.4 కోట్ల వేతనం

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసే సైబర్ సెక్యూరిటీ ప్రోఫెషనల్స్‌కు భారీగా డిమాండ్ పెరుగుతోంది. ఇండియాలో డిజిటల్‌కు ప్రాధాన్యత పెరుగుతున్న తరుణంలో ఈ రంగంలోకి డిమాండ్ పెరుగుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

పెద్ద నగదు నోట్లను రద్దు చేయడంతో డిజిటల్ మనీని ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. డిజిటల్ లావాదేవీలను చేసినవారికి ప్రోత్సాహకాలను కూడ ప్రకటించింది.

డిజిటల్ లావాదేవీలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడ కేంద్రీకరించాయి.ఈ తరుణంలో సైబర్ నేరాలు కూడ పెరిగిపోతున్నాయి. ఈ తరుణంలో సైబర్ నేరాలను అరికట్టేందుకు నిపుణులకు మరింత డిమాండ్ పెరిగింది.

సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్‌కు డిమాండ్

సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్‌కు డిమాండ్

సైబర్‌ నేరాలకు అడ్డుకట్ట వేసే సైబర్‌ సెక్యురిటీ ప్రొఫిషెనల్స్‌కు భారీగా డిమాండ్‌ పెరుగుతోంది. ముఖ్యంగా నాయకత్వ స్థానాల్లో వీరి కొరత ఎక్కువగా ఉందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. గత ఏడాదిగా ఇండియా ఇంక్‌లో సైబర్‌ సెక్యురిటీ ప్రొఫిషెనల్స్‌కు బాగా కొరత ఏర్పడిందని, దీంతో ఈ బాధ్యతలు నిర్వర్తించే వారికి 25-35 శాతం ఎక్కువగా వేతనాలు ఆఫర్‌ చేస్తున్నట్టు నివేదికలు తెలిపాయి.

ఏడాదికి రూ. 2 కోట్లు

ఏడాదికి రూ. 2 కోట్లు

ఏడాదికి టాప్‌ రోల్స్‌కు వార్షిక వేతనం రూ.2 కోట్లకు పైన ఉంటుంది. వేరియబుల్స్‌ వంటి వాటిని మొత్తం కలుపుకొంటే కొందరికి రూ.4 కోట్ల వరకు ఉంటున్నాయి.
గతేడాది నవంబర్‌ 8న ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో, డిజిటల్‌ లావాదేవీలు పెరిగి సైబర్‌ సెక్యురిటీ టాలెంట్‌కు భారీగా డిమాండ్‌ ఏర్పడింది. . దీంతో సైబర్‌ ప్రొఫిషెనల్స్‌ నియామకాలపై ఎక్కువగా దృష్టిసారించాయి.

సైబర్ సెక్యూరిటీ నిపుణులు తప్పనిసరి

సైబర్ సెక్యూరిటీ నిపుణులు తప్పనిసరి

తమ క్లయింట్ల బోర్డుల్లో చాలామంది సైబర్‌ సెక్యురిటీ కోసం కమిటీలను ఏర్పాటుచేస్తున్నట్టు సెర్చ్‌ సంస్థలు హంట్‌ పార్టనర్స్‌, ట్రాన్‌సెర్చ్‌ ప్రకటించాయి.. 18 నెలల క్రితం వరకు కూడా సైబర్‌ సెక్యురిటీ నిపుణులు ఇబ్బందుల్లో ఉన్న ఐటీ సర్వీసులు మాత్రమే సంప్రదించేవి. కానీ, ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సైబర్ సెక్యూరిటీ నిపుణుల కోసం అన్వేషిస్తున్నారు.

బ్యాంకులు, ప్రభుత్వ సంస్థల్లో సైబర్ సెక్యూరిటీ నిపుణులకు డిమాండ్

బ్యాంకులు, ప్రభుత్వ సంస్థల్లో సైబర్ సెక్యూరిటీ నిపుణులకు డిమాండ్

కన్సల్టింగ్‌ సంస్థలు, బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు, రిటైల్‌, బీఎఫ్‌ఎస్‌ఐ కంపెనీలు, ఐటీ కంపెనీల్లో సైబర్ సెక్యూరిటీ నిపుణులకు డిమాండ్ బాగా ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.నాయకత్వ స్థానాల్లో పనిచేసే సైబర్‌ సెక్యురిటీ ప్రొఫిషెనల్స్‌కు డిమాండ్‌ బాగా ఉందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ తరహ విభాగంలో నైపుణ్యం సాధిస్తే ఏడాదికి కోట్లాది రూపాయాల వేతనాన్ని దక్కించుకోవచ్చు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
facing a scarcity of cybersecurity professionals, especially at the leadership level, has increased salaries offered for such roles by 25-35% over the past year. Hacking and cyberattacks are compelling firms to hire talent at a premium, with compensation packages for top roles at upwards of Rs 2 crore, and in some instances, close to Rs 4 crore, inclusive of variables. In addition, last year’s demonetisation and the government’s push for Digital India have pushed demand .

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి