83 రోజుల తరువాత తొలిసారిగా మోడీ: ఆ రెండు రాష్ట్రాల్లో ప్రధాని టూర్: ఆదుకోవడానికి ప్యాకేజీ
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా 14 రోజుల నాలుగో విడత లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఈ నాలుగో దశలో కేంద్ర ప్రభుత్వం భారీగా సడలింపులను ప్రకటించింది. రాష్ట్రాల్లో బస్సులు రోడ్డెక్కాయి. ఈ నెల 25వ తేదీ నుంచి విమానాలు.. వచ్చేనెల 1 నుంచి రైళ్లూ అందుబాటులోకి రానున్నాయి. అదే సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా అధికారిక పర్యటన నిర్వహించబోతున్నారు. మరి కాస్సేపట్లో ఈ పర్యటన ప్రారంభం కాబోతోంది.
83 రోజుల తరువాత తొలిసారిగా ఆయన రాష్ట్రాల పర్యటనకు రానున్నారు. చివరిసారిగా ఆయన ఉత్తర ప్రదేశ్ జిల్లాలో పర్యటించారు. ఫిబ్రవరి 29వ తేదీన ప్రయాగ్‌రాజ్, చిత్రకూట్‌లల్లో అధికారికలను చేపట్టారు. అంఫన్ తుఫాన్ బారిన పడిన పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో ప్రధానమంత్రి ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఈ ఉదయం 10 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్తారు. మొదట పశ్చిమ బెంగాల్‌లో ఏరియల్ సర్వే చేపడతారు.

అంఫన్ తుఫాన్ ధాటికి దెబ్బతిన్న జిల్లాలను పరిశీలిస్తారు. తూర్పు మిడ్నాపూర్, పశ్చి మిడ్నాపూర్, ఉత్తర 24 పరగణ, దక్షిణ 24 పరగణా జిల్లాలతో పాటు రాజధాని కోల్‌కత మీదుగా ఆయన ఏరియల్ సర్వే కొనసాగుతుంది. అనంతరం ఒడిశా బయలుదేరి వెళ్తారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఒడిశా తీర ప్రాంత జిల్లాల్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. గజపతి, గంజాం, భద్రక్, కటక, పూరీ, నయాగఢ్, నవరంగ్ పూర్, జగత్‌సింగ్ పూర్, బాాలాసోర్, మయూర్‌భంజ్, ఖుర్దా జిల్లాల్లో ఏరియల్ కొనసాగిస్తారు.
అనంతరం ఢిల్లీకి తిరిగి వెళ్తారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, జాతీయ విపత్తు నిర్వహణ విభాగం, ఇతర అధికారులతో సమావేశమౌతారు. ఏరియల్ సర్వే నిర్వహిస్తోన్న సమయంలో ఆయన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌లతో ఫోన్ ద్వారా సంభాషిస్తారని ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది. ఈ రెండు రాష్ట్రాల్లో సంభవించిన నష్టానికి అనుగుణంగా ఆర్థిక ప్యాకేజీని ప్రకటించే అవకాశం ఉంది.'
Recommended Video
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications