తుపాన్ తో కూలిన ఇల్లు, పెద్ద దిక్కు కన్నుమూత .. చేసిన అప్పు తీర్చలేక చాకిరీకి బాలుడు
చెన్నై : ప్రక్రతి ఆ ఇంటిపై పగబట్టింది. తుపాన్ బీభత్సంతో నీడనిచ్చే ఇల్లు కూలింది. ఇంటి పెద్ద తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. అంత్యక్రియలకు డబ్బుల్లేని దుస్థితి. అందుకోసమే అప్పుచేసింది ఆ ఇల్లాలు. అదే ఆమె పాలిట శాపమైంది. తన కొడుకును వెట్టిచాకిరీ చేయించేందుకు దారితీసింది. తమిళనాడులోని తంజావూర్ లో ఈ హృదయవిదారకర ఘటన జరిగింది.

అప్పుతీర్చకపోవడంతో బిడ్డతో చాకిరీ
ఈ ఏడాది జనవరిలో గజ తుపాన్ రక్కసి విరుచుకుపడింది. తమిళనాడులోని తంజావూరులో తుపాన్ ప్రభావం ఎక్కువగానే ఉన్నది. దీంతో ఓ ఇల్లు కూలిపోయింది. దురదృష్టవశాత్తు ఆ ఇంటి యాజమాని ప్రాణాలు కోల్పోయాడు. అంత్యక్రియలకు డబ్బులు లేకపోవడంతో అతని భార్య భూస్వామి వద్ద అప్పు చేసింది. తీసుకున్న రూ.36 వేలు గడువులోపు తీర్చలేకపోయింది. దీంతో తన పదేళ్ల కుమారుడిని భూస్వామి వద్ద వెట్టిచాకిరీ కోసం అప్పగించింది.

ఆగిన చదువు .. భూస్వామి వద్దకు బాలుడు
దీంతో చేసేదీమీ లేక ఆ బాలుడు చదువును ఐదో తరగతి మధ్యలోనే ఆపివేశాడు. భూస్వామి వద్ద చాకిరీకి దిగాడు. ఆ పిల్లాడి పట్ల భూస్వామి కఠినంగా వ్యవహరించేవాడు. ఒక్కపూట మాత్రమే భోజనం పెట్టి .. 200 మేకలు కాయించేవాడు. దీంతో ఈ విషయం స్వచ్చంద సంస్థకు తెలియడంతో భూస్వామి వెట్టిచాకిరీ భాగోతం వెలుగులోకి వచ్చింది.

చాకిరీ నుంచి విముక్తి
స్వచ్చంద సంస్థ రంగ ప్రవేశంతో బాలుడికి విముక్తి కలిగింది. ఈ విషయాన్ని వారు స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు బాలుడుని భూస్వామి కబంధహస్తాల నుంచి రక్షించారు. ప్రభుత్వ సంరక్షణ కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం భూస్వామి పరారీలో ఉన్నాడని .. అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications