ముంచుకొస్తున్న తుపాను ముప్పు: తీవ్ర రూపం దాల్చనున్న ‘మోచా’
న్యూఢిల్లీ: ఇప్పటికే దేశంలో చాలా ప్రాంతాల్లో అకాల వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం జరగ్గా.. ఇప్పుడు తుఫాను రూపంలో మరో పిడుగు వచ్చిపడుతోంది. వచ్చే వారంలో తూర్పు తీర రాష్ట్రాలకు తుఫాను ముప్పుపొంచి ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో తుపాను బలపడే అవకాశాలున్నట్లు అంచనా వేసింది. మత్స్యకారులు ఎవరూ కూడా సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించింది.
ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర తుపానుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. మే 6, 2023 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో, మరుసటి రోజు అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.

తుపాను మే 8న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. అందువల్ల, ఇది దాదాపు ఉత్తరం వైపుగా మధ్య బంగాళాఖాతం వైపు కదులుతున్న సమయంలో తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(IMD) తెలిపింది.
ఆ తర్వాత ఇది తీవ్ర అల్పపీడనంగా కేంద్రీకృతమై మే 9వ తేదీ నాటికి తుఫానుగా బలపడే అవకాశం ఉంది. ఈ తుపాను ఉత్తరదిశగా కదులుతూ మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఈ తుపాను ఏర్పడితే దానికి మోచా అని పేరు పెట్టనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. యెమెన్ దేశంలోని పోర్టు నగరం మోచా పేరుమీదుగా పేరు పెట్టినట్లు పేర్కొంది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత తుపాను దిశ గురించి మరింత ఖచ్చితమైన సమాచారం తెలుస్తుందని ఐఎండీ వెల్లడంచంది. వచ్చేవారంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించింది.
A cyclonic circulation is likely to develop over Southeast Bay of Bengal around 6th May 2023. Under its influence a low pressure area is likely to form over the same region around 7th May. It is likely to concentrate into a depression over Southeast Bay of Bengal on 8th May.… pic.twitter.com/WbErCnwSIT
— ANI (@ANI) May 3, 2023
సాధారణంగా రుతుపవనాలకు ముందు ఏప్రిల్-జూన్ సీజన్లో బంగాళాఖాతంలో తరచూ తుపానులు ఏర్పడుతుంటాయి. మేలో వీటి ముప్పు మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక దేశంలో అక్టోబర్-డిసెంబర్ మధ్య తిరోగమన రుతుపవనాల ప్రభావంతో మరో తుపాను సీజన్ ఉంటుందని పేర్కొంది.
అంతేగాక, పశ్చిమతీరంలోని అరేబియా సముద్రంలో కూడా తుపానులు ఏర్పడుతుంటాయని వెల్లడించింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం ఇప్పటికే 18 తీరప్రాంత, పరిసర జిల్లాల కలెక్టర్లు, 11 శాఖల అధికారులను అప్రమత్తం చేసినట్లు దాని ప్రత్యేక సహాయ కమిషనర్ సత్యబ్రత సాహు బుధవారం తెలిపారు.
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications