గుజరాత్‌లో తౌక్టే తుఫాను బీభత్సం: ఏడుగురు మృతి, భారీ నష్టం, కోస్ట్ గార్డ్ రెస్క్యూ ఆపరేషన్లు

గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలో తౌక్టే తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాలు, ఈదురుగాలులతో చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. పలు ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి. రోడ్లు కూడా బాగా దెబ్బతిన్నాయి. తుఫాను కారణంగా రాష్ట్రంలో గురువారం ఏడుగురు మరణించారు.

రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 16,000 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 40వేలకుపైగా చెట్లు నేలకూలాయి. వెయ్యి విద్యుత్ స్తంభాలు పడిపోయాయని ముఖ్యమంత్రి విజయ్ రూపానీ. సముద్ర తీర ప్రాంతాల్లో భారీ నష్టం నష్టం జరిగింది. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, ఇతర రెస్క్యూ టీంలు, అధికారులు సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు.

 Cyclone Tauktae: Massive rescue operations on after cyclone sinksbarge; 7 dead in Gujarat

8 మందితో సముద్రంలో కొట్టుకుపోయిన ఓ నౌకను ఇండియన్ కోస్ట్ గార్డ్ కాపాడింది. మరో షిప్‌(గాల్ కన్‌స్ట్రక్టర్)లో కొట్టుకుపోయిన 8 మందిని కూడా కోస్టా గార్డ్ రక్షించింది. కాగా, ఇప్పటి వరకు గుజరాత్ రాష్ట్రంలో తుఫాను బీభత్సం కారణంగా భారీ వర్షాలు, ఈదురుగాలులతో 19 మంది మరణించారు.

భారీ వర్షాలు ఇంకా కురుస్తుండటంతో పెద్ద ఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. విద్యుత్ స్తంభాలు కుప్పకూలిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా 2400 గ్రామాలు సోమవారం నుంచి అంధకారంలోనే ఉన్నాయి. 160 రహదారులు తుడిచిపెట్టుకుపోయాయి. 40వేల చెట్లు నేలకూలాయి. భారీ సంఖ్యలు నివాసాలు ధ్వంసమయ్యాయని సీఎం విజయ్ రూపానీ తెలిపారు.

ముంబై సముద్ర తీరంలో కొట్టుకుపోతున్న రెండు ఆయిల్ ట్యాంకర్ షిప్పులను ఇండియన్ కోస్ట్ గార్డ్(ఐసీజీ) మంగళవారం ఒడ్డుకు చేర్చింది. గత రెండు మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో ముంబై మహానగరం కూడా అతలాకుతలమైంది. ముంబై నగరంలోని అనేక ప్రాంతాలు వరదనీటితో నిండిపోయాయి. ముంబై సముద్ర తీరంలో నౌకలు కొట్టుకుపోవడంతో.. వాటిని నావికాదళాలు రంగంలోకి దిగి కాపాడాయి. మొత్తం 410 మందిని రక్షించాయి. మహారాష్ట్రలో భారీ వర్షాలు, ఈదురుగాలులతో సుమారు 20 మంది మరణించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+