గుజరాత్ తీరాన్ని తాకిన తౌక్తే తుపాను -గంటకు 185కి.మీ గాలులు -గంటలపాటు విధ్వంసం: ఐఎండీ
1998నాటి పెనుతుపాను తర్వాత అంతకంటే ప్రళయకారకంగా భావిస్తోన్న ప్రస్తుత తౌక్తే తుపాను గుజరాత్ తీరాన్ని తాకింది. అరేబియా సముద్రంలో మరింత శక్తిమంతంగా మారిన తౌక్తే పెను తుపాను సోమవారం రాత్రి గుజరాత్ తీరం మీదుగా భూమిపైకి చేరడం ప్రారంభమైంది. తుపాను కేంద్ర స్థానం.. పోరుబందర్, మహువా ప్రాంతాల మధ్య తీరాన్ని దాటనుందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది.
తౌక్తే తుపాను భూమిపైకి చేరే ప్రక్రియ సుదీర్ఘంగా గంటలపాటు సాగనుంది. తుపాను తీరాన్ని తాకడంతో గుజరాత్ రేవు పట్టణాలన్నీ అల్లకల్లోలంగా మారాయి. ఇప్పుడు అక్కడ గంటకు 185కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులతో పరిస్థితి బీభత్సకరంగా మారింది. గుజరాత్ తీరంలో తౌక్తే ప్రభావం 2 గంటల పాటు కొనసాగనుందని ఐఎండీ అంచనా వేసింది.

తుపాను తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉండడంతో అప్రమత్తమైన గుజరాత్ ప్రభుత్వం సోమవారం లక్షన్నర మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. నౌకాశ్రయాలతోపాటు ప్రధాన విమానాశ్రయాన్ని మూసివేసింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అత్యంత తీవ్రతతో సంభవిస్తున్న తుపాను ఇదే. ఈ తుపాను ఇప్పటికే కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపించింది. ముంబై సహా పలు నగరాల్లోనూ విమాన సర్వీసులు నిలిపేశారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications