మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమికే అధికారం- దైనిక్ భాస్కర్ సంచలనం..!
మహారాష్ట్రలో ఒకే దశలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలపై జాతీయ మీడియా సంస్థ దైనిక్ భాస్కర్ సంచలన అంచనాలను విడుదల చేసింది. మిగతా అన్ని ఎగ్జిట్ పోల్స్ కు భిన్నంగా దైనిక్ భాస్కర్ రిపోర్టర్ల ఎగ్జిట్ పోల్ ఈసారి మహారాష్ట్రలో అధికారం విపక్ష మహా వికాస్ అఘాడీ కూటమిదే అని తేల్చిచెప్పేసింది. మహారాష్ట్రలో మహాయుతి, మహా వికాస్ అఘాడీ కూటముల మధ్య హోరాహోరీ పోరు జరిగినా ఇందులో కాంగ్రెస్ నేతృత్వంలోని ఎంవీఏ గెలబోతున్నట్లు తేల్చింది.
మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 సీట్లు ఉన్నాయి. ఇందులో ఈసారి కాంగ్రెస్, ఎన్సీపీ శరద్ పవార్ వర్గం, శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గంతో కూడిన మహా వికాస్ అఘాడీ కూటమికి 130 నుంచి 150 సీట్లు లభించే అవకాశం ఉందని దైనిక్ భాస్కర్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది.అలాగే బీజేపీ, శివసేన షిండే వర్గం, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గంతో కూడిన అధికార మహాయుతి కూటమికి 125 నుంచి 140 సీట్లు వస్తాయని దైనిక్ భాస్కర్ అంచనా వేసింది. ఇతరులకు మరో 20 నుంచి 25 సీట్లు వస్తాయని తెలిపింది.

మహారాష్ట్రలో ఇవాళ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమికే అధికారం దక్కబోతోందని మెజర్టీ ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. అయితే దైనిక్ భాస్కర్ రిపోర్టర్ల ఎగ్జిట్ పోల్ మాత్రం కాంగ్రెస్ కూటమికే అధికారం దక్కబోతోందని చెప్పడంతో అనుమానాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ ను వైఫల్యాలు వెంటాడుతున్నాయి. దీంతో పలు ఎగ్జిట్ పోల్ సంస్ధలు ఈసారి మౌనంగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో దైనిక్ భాస్కర్ పోల్ చర్చనీయాంశమవుతోంది.












Click it and Unblock the Notifications