నిర్బంధించి అక్కాచెల్లెళ్లపై మూడు రోజులు గ్యాంగ్ రేప్
కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లో సామూహిక అత్యాచారాలకు అంతు లేకుండా పోతోంది. తాజాగా కాన్పూర్ సమీపంలోని దిహత్ జిల్లా మహరాజ్‌పూర్ అక్కచెల్లెళ్లని వారి ఇంట్లోనే నిర్బంధించి మూడు రోజులపాటు ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దళిత కుటుంబానికి చెందిన ఇద్దరు బాలికల్లో ఒకరు మైనర్ అని, తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
బాధితుల ఇంటికి పొరుగున నివసించే పంకజ్‌ను అరెస్టు చేయగా, మరో ఇద్దరు అమిత్, వివేక్ సింగ్‌ల కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. కాన్పూర్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న తండ్రి ఆఫీసుకు వెళ్లిన సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. నలుగురు కుమార్తెలు ఇంట్లోనే ఉన్నా, వారిలో చివరి ఇద్దరిని ఓ గదిలో నిర్బంధించి, పెద్దవారిద్దరిపైనా యువకులు వరుసగా మూడు రోజులపాటు అత్యాచారం జరిపారు.

ఇంటికి రాగానే తండ్రికి కూతుళ్లు వివరాలు చెప్పారు. దీంతో అతను గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికలను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు జిల్లా ఎస్‌పి వాజి అహ్మద్ తెలిపారు. మార్చి 17వ తేదీన మహరాజ్‌పూర్ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు సాగిస్తున్నారు. బాధితులను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపించారు. వివేక్ సింగ్ అనే నిందితుడి పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారంనాడు పోలీసులు ఈ కేసు వివరాలను వెల్లడించారు.












Click it and Unblock the Notifications