ఇంట్లోనుంచి లాక్కెళ్లి మహిళపై గ్యాంగ్‌రేప్ చేశారు
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్ సమీపంలోని గుంగా గ్రామంలో దారుణం జరిగింది. ఇంట్లో తన పిల్లలతో ఒంటరిగా ఉన్న ఓ దళిత మహిళను బలవంతంగా బయటికి ఈడ్చుకెళ్లిన ఐదుగురు యువకులు సమీపంలోని పొలాల్లో ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
శనివారం గుంగా పోలీస్ స్టేషన్‌లో ఘటనపై కేసు నమోదైంది. ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. బాధిత మహిళ వ్యవసాయ కూలీ కాగా, ఆమె భర్త ధమర్ర గ్రామంలో ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.

సమీపంలోని గ్రామంలో పని ఉంండటంతో బాధితురాలి భర్త అక్కడికి వెళ్లాడు. ఇద్దరు కూతుళ్లతోపాటు ఆమె తన ఇంట్లో ఉండగా.. ఐదుగురు యువకులు ఆమె ఇంట్లోకి ప్రవేశించి నిద్రిస్తున్న ఆమెను బలవంతంగా బయటికి లాక్కెళ్లారు. సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ట్రాక్టర్‌పై ఆమె భర్త వస్తున్నట్లు గమనించిన దుండగులు అక్కడ్నుంచి పరారయ్యారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. అయితే ఆమె తన భర్తకు జరిగిన విషయాన్ని తెలిపింది. దీంతో శనివారం ఇద్దరు దంపతులు పోలీసులను ఆశ్రయించి నిందితులపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ముగ్గురు నిందితులు జగదీష్, సోనూ, మనోజ్‌లను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ముస్తక్, బబ్లూల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications