రూ.500, రూ.1000 నోట్లతో జీతం, కంపెనీపై కేసు నమోదు
డామన్: రూ.500, రూ.1000 నోట్ల రద్దు ఓ కంపెనీకి చిక్కులు తెచ్చి పెట్టింది! వేతనంగా పాత నోట్లు ఇవ్వడంతో యాజమాన్యం పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన డామన్‌లో చోటు చేసుకుంది. ఆ కంపెనీ ప్లాస్టిక్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ.

అందులోని ఉద్యోగికి నెల జీతం కింద పాత నోట్లను ఇచ్చారు. రద్దు చేసిన నోట్లను వేతనంగా తనకు చెల్లించిందని తాను పని చేస్తున్న ప్లాస్టిక్ వస్తువుల తయారీ సంస్థ యాజమాన్యంపై కంస్‌రాజ్ ప్రధాన్ అనే ఉద్యోగి ఫిర్యాదు చేశాడు.
తన జీతం నెలకు రూ.12వేలు అని, సంస్థ రెండు వెయ్యి రూపాయల నోట్లు, 20 అయిదువందల రూపాయల నోట్లను ఇచ్చిందని అతను పేర్కొన్నారు. నోట్ల రద్దు విషయం తెలిసి కూడా పంపిణీ చేయడం మోసం కిందకు వస్తుందని, అందుకే ఆ సంస్థపై ఐపీసీ 420 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications