Hema Malini : జనవరి 22న అయోధ్యలో నటి హేమమాలిని నృత్య ప్రదర్శన..
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి మరికొ్ద్దిరోజులే మాత్రమే సమయం ఉంది. ఈ మహత్తర కార్యక్రమానికి సంబంధించిన పనులన్నీ శరవేగంగా సాగుతున్నాయి. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా జనవరి 14 నుండి 22 వరకు అయోధ్య ఉత్సవాలు జరగనున్నాయి.
ఈ రోజు నుంచి ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. దీంతోపాటు ఈనెల 14నుంచి 22 వరకు జగద్గురు రామానందాచార్య స్వామి రామభద్రాచార్య అమృత మహోత్సవం కూడా జరగనుంది. ఇక అయోధ్య రామలయ ప్రారంభం సమయంలో బాలీవుడ్ నటి, బిజెపి ఎంపీ హేమమాలిని స్పెషల్ నృత్య ప్రదర్శన చేయనున్నారు.

ఈ కార్యక్రమంలో బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలినితో పాటు ఇతర కళాకారులు కూడా పాల్గొంటారు. ఇందులో నటి హేమమాలిని స్పెషల్ గా నృత్య ప్రదర్శను ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్‌మీడియాలోని తన ఖాతాలో తెలిపారు.
రామాయణం ఆధారంగా ఉండే ఈ నృత్యరూపకాలన్ని ప్రదర్శించే అవకాశం తనకు లభించిందని హేమమాలిని పోస్టు చేయడం జరిగింది. హేమమాలిని నవంబర్ 2023లోలోక్‌సభ నియోజకవర్గంలో సంత్ మీరాబాయి 525వ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఒక నృత్య నాటకాన్ని ప్రదర్శించడం జరిగింది. ఈ పోస్ట్ కాస్త నెట్టింట తెగ వైరల్‌గా మారింది.
జనవరి 14 నుంచి 22 వరకూ అమృత్ మహోత్సవ్ ఉత్సవాలు..
ఇక, రాముడి విగ్రహ ప్రతిష్టకు కార్యక్రమానికి సంబంధించిన క్రతువులు జనవరి 16 నుంచే ప్రారంభం కానున్నాయి. జనవరి 22 వ తేది అయోధ్య శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం వారణాసికి చెందిన ప్రముఖ వేద పండితుడు లక్ష్మీకాంత్ దీక్షిత్ ఆధ్వర్యంలో జరగనుంది. అయోధ్యలో జనవరి 14 నుంచి 22 వరకూ అమృత్ మహోత్సవ్ పేరిట రోజూ ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి.
అయోధ్య వేడుకలకు హాజరయ్యే భక్తుల కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లును పూర్తిచేశారు. భక్తుల కోసం టెంట్ సిటీలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. వారికి భోజనం, వసతితో పాటు అవసరమైన సౌకర్యాలను కల్పించనున్నారు. సుమారు పదిహేను వేలమంది భక్తులు బస చేసేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.












Click it and Unblock the Notifications