Daughter: కిలాడీ కూతురు, కన్నింగ్ ప్రియుడు, ఇంట్లో కేజీ నగలు లూటీ చేసి ప్రియుడితో ?, మ్యాటర్ క్లోజ్ !
బెంగళూరు/ హెబ్బాళ: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో కాపురం చేసి ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది. పిల్లలు పుట్టిన తరువాత దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. భర్తతో విడాకులు తీసుకున్న మహిళ ఆమె పుట్టింటికి వెళ్లి అక్కడే నివాసం ఉంటున్నది. ఇదే సమయంలో కారు డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఆమె వెళ్లింది. కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న వ్యక్తితో చనువు పెంచుకున్న ఆమె అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇదే సమయంలో మహిళ ఇంట్లో ఉన్న కేజీ బంగారు నగలు మాయం అయ్యాయి. తన ఇంట్లో బంగారు నగలు చోరీ అయ్యాయని, రోల్డ్ గోల్డ్ నగలు ఉన్నాయని గుర్తించిన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు విచారణ చేసిన పోలీసులు కేసు పెట్టిన మహిళ కూతురిని అరెస్టు చేశారు. సొంత ఇంట్లో ఏకంగా కేజీ బంగారు నగలు కూతురు చోరీ చేసిందని, ఆమె ప్రియుడితో ఎంజాయ్ చేసిందని వెలుగు చూడటంతో అందరూ బిత్తరపోయారు.

భర్తకు విడాకులు ఇచ్చేసింది
బెంగళూరు నగరంలో జక్కూరు లేఔట్ లో దీప్తి (25) అనే మహిళ నివాసం ఉంటున్నది. కొన్ని సంవత్సరాల క్రితం దీప్తికి బాబు అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. వివాహం చేసుకున్న తరువాత దీప్తి ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది. పిల్లలు పుట్టిన తరువాత దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. కొన్ని సంవత్సరాలు భర్తతో కాపురం చేసిన దీప్తి తరువాత అతనికి విడాకులు ఇచ్చేసింది.

డ్రైవింగ్ స్కూల్ ప్రియుడు
భర్తతో విడాకులు తీసుకున్న దీప్తి జక్కూరులోని పుట్టింటికి చేరుకుని ఆమె తల్లితో కలిసి అక్కడే నివాసం ఉంటున్నది. ఇదే సమయంలో దీప్తి కారు డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఆమె వెళ్లింది. కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న మదన్ అనే వ్యక్తితో చనువు పెంచుకున్న దీప్తి అతనితో టచ్ లో ఉంది. మదన్ కు ఇప్పటికే వివాహం అయ్యి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

కేజీ నగలు మాయం చేసిన కిలాడీ కూతురు
దీప్తి ఇంట్లో ఆమె తల్లికి చెందిన సుమారు 1 కేజీ 500 గ్రాముల బంగారు నగలు ఉన్నాయి. ఇంట్లో ఉన్న సుమారు కేజీ నగలు చోరీ చేసిన దీప్తి వాటిని తీసుకెళ్లి ఆమె ప్రియుడు మదన్ కు ఇచ్చింది. చోరీ చేసిన నగల చోట రోల్డ్ గోల్డ్ నగలు తెచ్చిపెట్టిన దీప్తి ఏమీ తెలీనట్లు సైలెంట్ గా ఉండిపోయింది.

తల్లి ఇంట్లో నగలు చోరీ చేసింది సొంత కూతురు
పెళ్లికి వెళ్లాలని దీప్తి తల్లి బీరువాలో ఉన్న బంగారు నగలు బయటకు తీసింది. ఆ సమయంలో బీరువాలో ఉన్న నగలు, నా నగలకు తేడా ఉందని గమనించి కూతురు దీప్తిని ప్రశ్నించింది. వారం రోజుల నుంచి దీప్తి, ఆమె తల్లికి ఇదే విషయంలో గొడవ జరుగుతోంది. చివరికి తన ఇంట్లో బంగారు నగలు చోరీ అయ్యాయని, రోల్డ్ గోల్డ్ నగలు ఉన్నాయని గుర్తించిన దీప్తి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ప్రియుడితో ఎంజాయ్ చేసిన కిలాడీ లేడీ
కేసు విచారణ చేసిన పోలీసులు కేసు పెట్టిన మహిళ కూతురు దీప్తిని అరెస్టు చేశారు. సొంత ఇంట్లో ఏకంగా కేజీ బంగారు నగలు కూతురు దీప్తి చోరీ చేసిందని, ఆమె ప్రియుడు మదన్ కు ఇచ్చి మణప్పురం, ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీలో కుదువపెట్టి ఆ డబబుతో ఇద్దరూ ఎంజాయ్ చేశారని పోలీసులు చెప్పారు. తల్లి ఇంట్లో దీప్తి చోరీ చేసిందని వెలుగు చూడటంతో స్థానికులు అందరూ బిత్తరపోయారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications