‘తండ్రి కాదు, కామ పిశాచి’: రాజస్థాన్ సీఎస్‌పై కూతురు, భార్య ఫిర్యాదు
జైపూర్: తన కూతురుపై తన భర్తే లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాశ్ మీనాపై ఆయన భార్య ఆరోపణలు చేసింది. మగ బిడ్డను ఇవ్వలేదన్న కోపంతో ప్రతి రోజు తనను తన భర్త, ఆయన కుటుంబం కూడా చిత్రహింసలకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది.
కాగా, ఓం ప్రకాశ్ భార్య, ఆయన ప్రస్తుతం విడివిడిగా ఉంటున్నారు. మీనాపై ఆయన భార్య వేధింపుల కేసు కూడా పెట్టింది. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ 21న హైకోర్టులో విచారణ సందర్భంగా ఓం ప్రకాశ్ కూతురు తన తల్లికి అండగా నిలిచింది. అతడు చేసిన అఘాయిత్యాలను కోర్టుకు వివరించింది.
తన కూతురును లైంగికంగా వేధించేవాడని, తనను రోజూ కొట్టేవాడని ఓం ప్రకాశ్ భార్య తెలిపింది. కాగా, ప్రస్తుతం తన కూతురు లండన్‌లో చదువుతోందని చెప్పింది. వెంటనే ఓం ప్రకాశ్‌ను విధుల నుంచి తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు.

'మా నాన్న నన్ను ఓ భారంగా భావించేవాడు. నాపై ఖర్చు చేసే ప్రతి రూపాయి లెక్కకట్టేవాడు. తిట్టేవాడు. నన్ను అభ్యంతరకరంగా ముట్టుకునేవాడు. నేను 13ఏళ్ల వయసులో ఉన్నప్పుడు లైంగికంగా వేధించాడు. నా గదిలోకి వచ్చి చెప్పరాని చోట చేతులు వేసి అభ్యంతరకరంగా తాకేవాడు. ఈ విషయాన్ని అమ్మతో చెప్పాను. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని కూడా అమ్మ.. నాన్నను బెదరించింది. అయితే, మగ సంతానం కావాలని అమ్మను విడాకులు అడిగారు. రెండో పెళ్లికి అడ్డుగా ఉందని అమ్మను వేధించాడు. నేను ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు రాజీ కుదిర్చి ఆయనకు అనుకూలంగా ఉండేలా చేశారే తప్ప న్యాయం చేయలేదు' అని ఓం ప్రకాశ్ కూతురు తెలిపింది.
కాగా, దీనిపై ఓం ప్రకాశ్ స్పందిస్తూ.. తన భార్య, కూతురు.. తనపై చాలా కేసులు పెట్టారని, రెండు కేసుల్లో ఓడిపోయారని చెప్పారు. ఐదేళ్లుగా వారు తనకు దూరంగా ఉంటున్నారని చెప్పారు. తన కూతురు ప్రస్తుతం బ్రిటన్‌లో ఉంటోందని, ఆమె చేస్తున్న ఆరోపణలు అవాస్తవాలు అని తెలిపారు.












Click it and Unblock the Notifications