బెడ్ రూమ్ లో మొగుడు, టెర్రాస్ లో ప్రియుడు, ఆస్తి కోసం అత్తమామలు ?, ఒకేరాత్రిలో ?

న్యూఢిల్లీ: ప్రభుత్వ కాలేజ్ అండ్ స్కూల్ లో వైస్ ప్రిన్సిపాల్ గా ఉద్యోగం చేస్తున్న వ్యక్తి రిటైడ్ అయ్యారు. భార్య, కుమారుడు, కోడలితో కలిసి ఆయన సంతోషంగా జీవించారు. కొడుకు, కోడలికి పిల్లలు పుట్టడంతో రిటైడ్ వైస్ ప్రిన్సిపాల్ దంపతులు వారితో ఆడుకుంటూ కాలం గడుపుతున్నారు. ఇదే సమయంలో రిటైడ్ వైస్ ప్రిన్సిపాల్, ఆయన భార్య ఒకేసారి హత్యకు గురి కావడం కలకలం రేపింది.

రిటైడ్ వైస్ ప్రిన్సిపాల్ దంపతులకు వారి కోడలు ఆమె బాయ్ ఫ్రెండ్ తో కలిసి హత్య చేయించిదని వెలుగు చూడటంతో కొడుకుతో పాటు బంధువులు హడలిపోయారు. దేశ రాజధాని ఢిల్లీలోని గోకులపరి ఏరియాలో రాధేశ్యామ్ వర్మా అనే ఆయన నివాసం ఉంటున్నారు. ప్రభుత్వ పాఠశాల అండ్ కాలేజ్ లో వైస్ ప్రిన్సిపాల్ గా ఉద్యోగం చేసిన రాధేశ్యామ్ వర్మా రిటైడ్ అయ్యారు.

భార్య, కుమారుడు రవితో కలిసి రాధేశ్యామ్ వర్మా నివాసం ఉండేవాడు. రాధేశ్యామ్ కుమారుడు రవి కొన్ని సంవత్సరాల క్రితం మోనికా అనే మహిళను వివాహం చేసుకున్నాడు. రవి, మోనికా దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కింది అంతస్తులో రాధేశ్యామ్ వర్మా, ఆయన భార్య, మొదటి అంతస్తులో రవి, మోనికా, వారి పిల్లలు నివాసం ఉంటున్నారు.

couple-

ఇటీవల రాధేశ్యామ్ వర్మా ఆయన ఆస్తిలో కొంత భాగం విక్రయించాడు. ఆస్తి విక్రయించే విషయంలో రాధేశ్యామ్ వర్మా, ఆయన కోడలు మోనికాల మధ్య వాగ్వివాదం జరిగిందని తెలిసింది. ఆస్తి విక్రయించగా అడ్వాన్స్ గా రూ. 4 లక్షలు రావడంతో ఆ డబ్బు రాధేశ్యామ్ వర్మా ఆయన నివాసం ఉంటున్న గ్రౌండ్ ఫ్లోర్ లోని బీరువాలో పెట్టారు.

రవి భార్య మోనికాకు అక్రమ సంబంధం ఉంది. భర్త రవి కళ్లుకప్పి ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న మోనికాకు అత్తమామల ఆస్తి మీద కన్ను పడింది. మొదట మామ రాధేశ్యామ్ వర్మాతో పాటు అత్తను చంపేయాలని, తరువాత భర్త రవిని కూడా చంపేసి ప్రియుడితో కలిసి హ్యాపీగా ఉండాలని మోనికా మాస్టర్ ప్లాన్ వేసింది.

 affaire

ప్రియుడికి ఫోన్ చేసిన మోనికా నువ్వు మరోకరిని వెంటపెట్టుకుని వస్తే తన ఇంటి టెర్రాస్ మీద ఇద్దరిని దాచిపెడుతానని, అర్దరాత్రి దాటిన తరువాత తన మామ రాధేశ్యామ్ వర్మా, ఆయన భార్యను చంపేయాలని చెప్పింది. అనుకున్నట్లు ఆదివారం రాత్రి మోనికా ప్రియుడు, అతని స్నేహితుడు మోనికా ఇంటి దగ్గరకు వెళ్లారు. భర్త రవి రాకముందే మోనికా ఆమె ప్రియుడు, అతని ఫ్రెండ్ ను టెర్రాస్ మీదకు పిలుచుకుని వెళ్లిపోయి ఇద్దరిని అక్కడ దాచిపెట్టింది.

అర్దరాత్రి వరకు మోనికా ప్రియుడు, అతని ఫ్రెండ్ అక్కడే దాక్కున్నారు. అర్దరాత్రి దాటిన తరువాత మోనికా ప్రియుడు, అతని ఫ్రెండ్ గ్రౌండ్ ఫ్లోర్ లోకి వెళ్లి రాధేశ్యామ్ వర్మా, ఆయన భార్య గొంతులు కోసం దారుణంగా హత్య చేశారు. బీరువాలో ఉన్న రూ. 4 లక్షలు ఎత్తుకుని చిన్నగా అక్కడి నుంచి పరారైనారు.

death

మరుసటి రోజు రవి అతని తల్లిదండ్రులు హత్యకు గురైన విషయం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మొదట పోలీసులు కూడా దొంగలు రాధేశ్యామ్ దంపతులను హత్య చేసి బీరువాలో ఉన్న డబ్బులు దోచుకుని వెళ్లి ఉంటారని అనుకున్నారు. అయితే ఒక్కరోజులోనే పోలీసులకు రాధేశ్యామ్ వర్మా కోడలు మోనికా మీద అనుమానం వచ్చింది.

మోనికా పదేపదే వేరే వ్యక్తికి ఫోన్ లు చెయ్యడంతో పోలీసులకు ఇంకా అనుమానం పెరిగిపోయి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆస్తి కోసం తన బాయ్ ఫ్రెండ్, అతని స్నేహితుడితో కలిసి తన అత్తమామలను హత్య చేయించానని మోనికా అంగీకరించిందని పోలీసులు అన్నారు. ఆస్తి కోసం 70 ఏళ్లు దాటిన అత్తమామలను మోనికా హత్య చేయించడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+