Daughter: ఊరికి వెళ్లిన భర్త, కూతుర్ని నీటి బకెట్ లో ముంచి చంపేసి ఉరి వేసుకున్న తల్లి !
బెంగళూరు/చెన్నై: పెద్దలు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. భార్యను పోషించడానికి ఐటీ హబ్ చేరుకున్న భర్త ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్ గా ఉద్యోగం చేస్తున్నాడు. దంపతులకు ఓ కూతురు ఉంది. మూడు వారాల క్రితం తల్లి ఆత్మహత్య చేసుకోవడంతో అతను భార్య, కూతురితో కలిసి సొంత ఊరికి వెళ్లాడు. తల్లి అంత్యక్రియలు పూర్తి అయిన తరువాత భార్య, కూతురిని ఐటీ హబ్ పిలుచుకుని వెళ్లాడు. తల్లి చినిపోవడంతో మళ్లీ అతను సొంత ఊరికి వెళ్లాడు. ఇంట్లో ఉన్న భార్య ఆమె కూతురిని నీటి బకెట్ లో ముంచి హత్య చేసి ఫ్యాన్ కు ఉరి వేసుకుంది. వేకువ జామున ఇంటికి చేరుకున్న భర్త తలుపులు పగలగొట్టి చూడగా ఈ దారుణం వెలుగు చూడటంతో బంధువులు, స్థానికులు హడలిపోయారు.

ఐదు సంవత్సరాల క్రితం పెళ్లి
తమిళనాడులోని ఈరోడ్ లో నివాసం ఉంటున్న నరేంద్రన్ అనే వ్యక్తి ఐదు సంవత్సరాల క్రితం తల్లిదండ్రులు సెట్ చేసిన గాయిత్రీ దేవి (28) అనే యువతిని వివాహం చేసుకున్నాడు. పెద్దలు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న నరేంద్రన్, గాయిత్రీ దేవి దంపతులు ఇంతకాలం చాలా సంతోషంగా కాపురం చేస్తున్నారు.

బెంగళూరులో ఉద్యోగం
నరేంద్రన్, గాయిత్రీ దేవి దంపతులకు సంయుక్తా (3) అనే కుమార్తె ఉంది. భార్య గాయిత్రీ దేవి, కూతురు సంయుక్తాను పోషించడానికి ఐటీ హబ్ బెంగళూరు చేరుకున్న నరేంద్రన్ హెచ్ఏఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విభూతినగర సమీపంలోని దోడ్డనక్కుందిలోని గురురాజ్ లేఔట్ లో అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నాడు.

తల్లి ఆత్మహత్య చేసుకోవడంతో షాక్
నరేంద్రన్ బెంగళూరులోని ఓ ప్రముఖ ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్ గా ఉద్యోగం చేస్తున్నాడు. 20 రోజుల క్రితం కుటుంబ సమస్యల కారణంగా ఈరోడ్ లో నివాసం ఉంటున్న నరేంద్రన్ తల్లి ఆత్మహత్య చేసుకుంది. తల్లి ఆత్మహత్య చేసుకోవడంతో నరేంద్రన్ అతని భార్య గాయిత్రీ దేవి, కూతురు సంయుక్తాతో కలిసి ఈరోడ్ వెళ్లాడు.

భార్య, కూతురు బెంగళూరులో
తల్లి అంత్యక్రియలు పూర్తి అయిన తరువాత భార్య గాయిత్రీ దేవి, కూతురిని బెంగళూరు పిలుచుకుని వచ్చిన నరేంద్రన్ వారం రోజులు ఇక్కడే ఉన్నాడు. తరువాత మళ్లీ పనిమీద నరేంద్రన్ ఈరోడ్ వెళ్లాడు. నరేంద్రన్ ఊరికి వెళ్లడంతో బెంగళూరులోని ఇంట్లో అతని భార్య గాయిత్రీ దేవి, ఆమె కూతురు సంయుక్తా మాత్రమే ఉన్నారు.

కూతురిని చంపేసి ఉరి వేసుకున్న గాయిత్రీ దేవి
వేకువ జామున గాయిత్రీ దేవి ఆమె కూతురు సంయుక్తాను నీటి బకెట్ లో ముంచి హత్య చేసింది, కూతురిని హత్య చేసిన తరువాత గాయిత్రీ దేవి బెడ్ రూమ్ లో ఫ్యాన్ కు ఉరి వేసుకుంది. వేకువ జామున ఇంటికి చేరుకున్న నరేంద్రన్ తలుపులు పగలగొట్టి చూడగా కూతురు సంయుక్త హత్యకు గురైన విషయం, గాయిత్రీ దేవి ఉరి వేసుకున్న విషయం వెలుగు చూసింది.

ఐసీయూలో భార్య
గాయిత్రీ దేవి ప్రాణంతో ఉండటంతో ఆమెను ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. గాయిత్రీ దేవి రాసిన డెత్ నోట్ లో తాను ఆత్మహత్య చేసుకుంటే కూతురి అనాథ అవుతుందని, అందుకే ఆమెను చంపేసి ఆత్మహత్య చేసుకుంటున్నానని రాసి ఉందని హెచ్ఏఎల్ పోలీసులు చెప్పారు. గాయిత్రీ దేవి పరిస్థితి విషమంగానే ఉందని, కేసు విచారణలో ఉందని పోలీసులు అంటున్నారు.
-
Viral Video: అందరిముందు I LOVE U చెప్పిన ప్రొఫెసర్.. చెప్పుతో కొట్టిన విద్యార్థిని -
పాలకోసం ఏడుస్తుందని పసిదాన్ని చంపేసిన తల్లి.. తిరుపతి జిల్లాలో దారుణం -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!!












Click it and Unblock the Notifications