"దావూద్ కారును తగలబెడుతున్నాం"
న్యూఢిల్లీ: మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ఉపయోగించిన కారును బహిరంగంగా అందరూ చూస్తుండగానే దహనం చేస్తామని హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాణి చెప్పారు. ఓ జాతీయ మీడియాకు ఆయన ఈ వివరాలు వెల్లడించారు.
బుధవారం మద్యాహ్నం 1 నుంచి 2 గంటల సమయంలో దావూద్ కారును దహనం చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్ లోని ఇద్రపురంలో దావూద్ కారును తగలబెట్టాలని తమ సంస్థ నిర్ణయించిందని స్వామి చక్రపాణి వివరించారు.
కిరాతకుడు దావూద్ ఇబ్రహీం, అతని ముఠా పాల్పడిన తీవ్రవాద కార్యకలాపాలకు అంత్యక్రియలు నిర్వహించాలనే ఉద్దేశంతోనే తాము ఈ కారును వేలంలో కొనుగోలుచేశామని, అందుకే దహనం చేస్తున్నామని ఆయన చెప్పారు.

మొదట ఈ కారును అంబులెన్స్ లా మార్చాలని హిందూ మహాసభ నిర్ణయించింది. అయితే దావూద్ ఇబ్రహీం అనుచరుల నుంచి పదేపదే బెదిరింపులు రావడంతో వారికి తగిన బుద్ది చెప్పడానికి కారును దహనం చేస్తున్నామని స్వామి చక్రపాణి అన్నారు.
డిసెంబర్ 9వ తేది నిర్వహించిన వేలంలో దావూద్ ఇబ్రహీం ఉపయోగించిన ఆకుపచ్చ హ్యుందయ్ అసెంట్ కారును హిందూ మహాసభ రూ. 32,000 దక్కించుకుంది. ఇదే సమయంలో దావూద్ కు చెందిన ఆస్తులను పలువురు వేలంలో దక్కించుకున్నారు.
దావూద్ కారు దహనం చేస్తున్న సందర్బంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. దావూద్ ఇబ్రహీం అనుచరులు ఇప్పటికే బెదిరింపులు చెయ్యడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. కొద్ది రోజుల క్రితమే దావూద్ కారును ముంబై నుంచి ఢిల్లీకి తరలించారు.












Click it and Unblock the Notifications