వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాస్‌పోర్ట్ కావాలంటే మతం మారండి!: హిందూ-ముస్లీం జంటకు చేదు, స్పందించిన సుష్మా

By Srinivas
|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని ఓ జంటకు పాస్‌పోర్టు కార్యాలయంలో చుక్కెదురైంది. ఓ ముస్లీం యువకుడు, హిందూ యువతి పెళ్లి చేసుకున్నారు. ఆ ముస్లీం యువకుడి పేరు మొహమ్మద్ అనాస్ సిద్ధిఖి. సిద్ధికి 2007లో తన్వి అనే హిందూ యువతిని పెళ్లి చేసుకున్నాడు.

తమకు పాస్ పోర్టు కార్యాలయంలో చేదు అనుభవం ఎదురైందంటూ తన్వి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశారు. తమను లక్నోలో పాస్ పోర్టు అధికారి ఎలా అవమానించాడో చెప్పింది.

Day After Being Harassed, Lucknow Inter-faith Couple Receive Passports; Officer Transferred

సిద్ధికి, తన్విలు నోయిడాలోని ఓ బహుళ జాతి కంపెనీలో ఉద్యోగులు. వీరికి ఆరేళ్ల పాప ఉంది. వీరిద్దరు పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వికాస్ అనే అధికారి తన్వి, సిద్ధికులపై మండిపడుతూ.. మీ వివాహం చెల్లదని చెప్పారు. నీవు హిందూమతంలోకి మారాలని సిద్ధిఖికి చెప్పారు. తమకు జరిగిన అవమానాన్ని తన్వి సుష్మాతో పాటు ప్రధానమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేశారు.

సదరు పాస్ పోర్టు అధికారి తన పాస్‌పోర్టును, తన భర్త పాస్‌పోర్టును హోల్డ్‌లో పెట్టారని తన్వి సేథ్ పేర్కొన్నారు. సిద్ధిఖి కూడా మాకు సహాయం చేయాలని సుష్మా స్వరాజ్‌కు, పీఎంవోకు, పాస్‌పోర్ట్‌సేవామేకు, ఎంఈఐఇండియాకు ట్యాగ్ చేశారు.

స్పందించిన సుష్మా స్వరాజ్

సిద్ధిఖి, తన్వీ సేథ్ ఫిర్యాదు పైన సుష్మా స్వరాజ్ జోక్యం చేసుకున్నారు. సదరు అధికారి వికాస్‌ను ట్రాన్సుఫర్ చేశారు. మరోవైపు, దీనిపై ఎక్స్‌టర్నల్ అఫైర్ మినిస్టర్ సెక్రటరీ డీఎం ములాయ్ కూడా స్పందించారు. ఆ జంటకు ఇబ్బంది కలిగినందుకు చింతిస్తున్నట్లు తెలిపారు. లక్నో కార్యాలయం నుంచి సమాచారం తీసుకొని, తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆ తర్వాత అధికారి ట్రాన్సుఫర్ అయ్యారు.

English summary
A passport officer in Lucknow allegedly rejected the application of an interfaith couple, and asked the husband, Mohammad Anas Siddiqui, to convert to Hinduism.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X