వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోదీ పరువు తీసిన గడ్కరీ -వ్యాక్సిన్ల కొరతపై సంచలనం -కేంద్రం ఏం చేస్తున్నదో తెలీదని వ్యాఖ్య

|
Google Oneindia TeluguNews

దేశంలో కరోనా మహమ్మారి విలయతాండం కొనసాగుతుండగా, నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 4,529 మంది ప్రాణాలు కోల్పోయినట్లు, కొత్తగా 2,67,334 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల్లో వెల్లడైంది. మరణాలు తారా స్థాయికి చేరినవేళ దేశంలో వ్యాక్సిన్ల కొరత ఏర్పడటం, టీకాల ఉత్పత్తి పెంపుపై కేంద్ర మంత్రులు తలోమాట చెబుతుండటం మరింత గందరగోళానికి దారితీసింది. నరేంద్ర మోదీకి బలమైన పోటీదారుగా, ఆర్ఎస్ఎస్ దృష్టిలో భావి ప్రధానిగా భావించే నితిన్ గడ్కరీ తాజా వ్యాఖ్యలు సంచలనంగా మారాయి..

బోర్లా పడ్డ రఘురామ -చంద్రబాబుకూ శిక్ష -డా.సుధాకర్ తీరన్న సాయిరెడ్డి -సుప్రీంకోర్టుకు చేరిన తెలంగాణ రిపోర్ట్బోర్లా పడ్డ రఘురామ -చంద్రబాబుకూ శిక్ష -డా.సుధాకర్ తీరన్న సాయిరెడ్డి -సుప్రీంకోర్టుకు చేరిన తెలంగాణ రిపోర్ట్

టీకాల కొరతపై గడ్కరీ..

టీకాల కొరతపై గడ్కరీ..

దేశంలో టీకాల కొరత లేదని వాదిస్తోన్న కేంద్రం.. బుధవారం నాటికి దేశవ్యాప్తంగా 18.58కోట్ల మందికి వ్యాక్సిన్ డోసులు అందాయని ప్రకటించింది. అయితే, చాలా రాష్ట్రాల్లో కొరత వల్ల వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిచిపోగా, రెండో డోసు కోసం పడిగాపులు కాస్తోన్నవారి సంఖ్యా పెరుగుతున్నది. 18-44ఏళ్లవారికి వ్యాక్సినేషన్ నిలిపేసిమరీ, ఆ కోటాలోని టీకాలను రెండో డోసు వారికి అందించే ప్రయత్నం జరుగుతున్నది. మోదీ తన ఇమేజ్ పెంచుకోడానికి ముందుకుముందే టీకాలను విదేశాలకు దానం చేశారని, తర్వాతైనా ఉత్పత్తిపై శ్రద్ధ పెట్టలేదని, కేవలం రెండు కంపెనీలకే అనుమతిచ్చి, ధరల నిర్ణయాన్ని వారికే వదిలేశారని పెద్ద ఎత్తున విమర్శలు రావడం తెలిసిందే. కేంద్ర కేబినెట్ లో దాదాపు నంబర్ 3గా భావించే ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సైతం దేశంలో వ్యాక్సిన్ల ఉత్పత్తిపై సొంత ప్రభుత్వాన్నే నిందిస్తున్నట్లు వ్యాఖ్యలు చేశారు..

రఘురామ వివాదంలో ట్విస్ట్: కేసీఆర్ ప్రస్తావన -జగన్‌పై భారీ కుట్రలు -సీల్డ్ కవర్‌లో సంచలన దృశ్యాలురఘురామ వివాదంలో ట్విస్ట్: కేసీఆర్ ప్రస్తావన -జగన్‌పై భారీ కుట్రలు -సీల్డ్ కవర్‌లో సంచలన దృశ్యాలు

మరో 10 కంపెనీలకు లైసెన్స్ ఇవ్వొచ్చుగా..

మరో 10 కంపెనీలకు లైసెన్స్ ఇవ్వొచ్చుగా..


దేశంలో డిమాండ్‌కు తగినట్టు వ్యాక్సిన్లు తయారుకావడం లేదని, ఆ దిశగా మరిన్ని కంపెనీలకు కేంద్రం అనుమతులు ఇవ్వాల్సి ఉందని మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. వివిధ యూనివర్శిటీల వైస్‌ఛాన్స్‌లర్లతో మంగళవారం వర్చువల్ సమావేశంలో మాట్లాడిన గడ్కరీ.. ప్రస్తుతం రెండు కంపెనీలకు మాత్రమే టీకాల తయారీకి అనుమతి కొనసాగుతుండటాన్ని ప్రశ్నిస్తూ, వ్యాక్సిన్ పేటెంట్ హోల్టర్లకు వీలైతే 10 శాతం రాయల్టీ చెల్లించైనా మరో 10 ఫార్మా కంపెనీలకు లైసెన్సులు ఇచ్చి టీకాల ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అంతటితో ఆగకుండా..

మోదీపై పరోక్ష విమర్శలు..

మోదీపై పరోక్ష విమర్శలు..

ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ నాగపూర్ నుంచి ప్రాతినిధ్యం వహించే నితిన్ గడ్కరీ ప్రధాని పదవికి మోదీకి పోటీదారుగా చాలా కాలం నుంచి వార్తల్లో నిలుస్తుండటం తెలిసిందే. మోదీపై అప్పుడప్పుడూ గడ్కరీ చురకలు వేస్తుండటం, గడ్కరీని నిలువరించేలా పలు కుంభకోణాల్లో ఆయన హస్తం ఉందని ఆరోపణలు వెల్లువెత్తడం, చివరికి అవి టీకప్పులో తుపానులా చల్లబడటం పరిపాటిగా మారిన క్రమంలో ఇప్పుడు వ్యాక్సిన్ల కొరతపైనా గడ్కరీ పరోక్షంగా మోదీపై విమర్శలు గుప్పించారు. తాను నిజమైన ఆత్మనిర్భర్ భారత్ ను కోరుతున్నానన్న గడ్కరీ.. మన దేశంలో తయారైన వ్యాక్సిన్లను ముందుగా మన ప్రజలకు అందించిన తర్వాతే మిగులు డోసుల్ని విదేశాలకు ఎగుమతి చేయాలని సూచించారు. ఇప్పటికే మన దేశం వ్యాక్సిన్ల ముడి సరుకు దిగుమతిపైనే ఆధారపడటం శోచనీయమని, మెడికల్ ఆక్సిజన్ కొరతను స్వయం సమృద్ధి ద్వారా అధిగమించొచ్చని అన్నారు. వ్యాక్సిన్ల లైసెన్సింగ్ విధానంలో అవసరమైతే కొత్త చట్టాలు తీసుకురావాల్సిందిగా ప్రధాని మోదీని కోరతానని గడ్కరీ అన్నారు. కానీ..

కేంద్రం కృషి తెలీదన్న గడ్కరీ..

కేంద్రం కృషి తెలీదన్న గడ్కరీ..

వ్యాక్సిన్ల కొరతను అధిగమించేందుకు మరో 10 ఫార్మా కంపెనీలకు అనుమతులివ్వాలంటూ తన ప్రభుత్వానికే సూచనలు చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆ వ్యాఖ్యలు చేసిన 24 గంటలు తిరిగేలోపే నాలుక కరుచుకున్నారు. నిజానికి మంగళవారం నాటి యూనివర్శిటీల వైస్‌ఛాన్స్‌లర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో గడ్కరీ కంటే ముందు మరో కేంద్ర (రసాయ, ఎరువుల శాఖ) మంత్రి మన్‌సుఖ్ మాలవియా కూడా పాల్గొని వ్యాక్సిన్ల ఉత్పత్తి పెంపు కోసం మోదీ సర్కార్ తీసుకున్న చర్యలను వివరించారు. కాన్ఫరెన్స్ లో తనకంటే ముందు మాట్లాడిన మంత్రి(మాలవియా) వ్యాక్సిన్లపై ఏం మాట్లాడారో వినలేకపోయినందుకే కొత్త కంపెనీలకు అనుమతులపై సూచనలు చేశానని గడ్కరీ వివరణ ఇచ్చుకున్నారు. కెమికల్ మంత్రి మాలవియా చెప్పినట్లు కేంద్రం ఇటీవలే టీకాల ఉత్పత్తికి మరో 10 ఫార్మా కంపెనీలకు అనుమతులు ఇచ్చిన విషయం తనకు తెలీదని గడ్కరీ నిస్సిగ్గుగా ఒప్పుకున్నారు. ''టీకాల ఉత్పత్తి కోసం కేంద్రం చేస్తోన్న కృషి గురించి నాకు తెలీక సూచనలు చేశాను. సరైన సమయంలో వారు(కెమికల్ శాఖ) సముచిత నిర్ణయం తీసుకున్నందుకుగానూ అభినందిస్తున్నాను. ఈ విషయం రికార్డుల్లో ఉండటానికే నేను వివరణ ఇస్తున్నాను'' అని గడ్కరీ చెప్పుకొచ్చారు. దీనిపై..

బాస్ మోదీ పట్టింపులేని గడ్కరీ..

బాస్ మోదీ పట్టింపులేని గడ్కరీ..

ప్రధాని మోదీకి తొలి నుంచి తన ఇమేజ్ తప్ప మంత్రిమండలి ఉమ్మడి నిర్ణయాలపై, నిపుణుల సలహాలపై ఎలాంటి పట్టింపులు లేవనడానికి గడ్కరీ ఉదంతం మరో ఉదాహరణ అని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ''పాపం కేంద్రమంత్రి గడ్కరీ గారి మాటలు ఆయన బాస్ మోదీ వింటున్నారా?'' అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేశ్ ఎద్దేవా చేశారు. ఏప్రిల్ 18న మజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. ప్రధాని మోదీకి రాసిన లేఖలో ఫార్మా కంపెనీల లైసెన్సింగ్ విధానంపై కీలక సూచలను చేశారని, కాంగ్రెస్ నేతల సూచనలు పట్టించుకోకున్నా, కనీసం మోదీ తన సహచరుడు గడ్కరీ మాటలైనా వినుంటే బాగుండేదని జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. మొత్తానికి.. కేంద్రం సర్కార్ వివిధ సంస్థల ద్వారా టీకాల తయారీకి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్న విషయం తన దృష్టికి ఆలస్యంగా వచ్చిందంటూ గడ్కరీ ఇచ్చిన వివరణ ప్రధాని మోదీ పరువుతీసేలా ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి..

English summary
A day after he suggested that more pharma companies should be allowed to manufacture the COVID-19 vaccine, Union Minister Nitin Gadkari clarified that he was unaware of a speech made by Union Minister Mansukh Mandaviya that explained government's efforts to ramp up vaccine production. Gadkari, in his series of tweet, said after his remark at the conference, Mandaviya informed him about 12 different plants and companies which has been facilitated by the Centre for vaccine manufacturing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X