మరో ఘోరం: పట్టపగలు యువతిని కాల్చి చంపేశారు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పట్టపగలే ఓ యువతిపై ఇద్దరు దుండగులు తుపాకీతో కాల్పులు జరిపి హత్య చేశారు. జలౌన్ జిల్లాలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. కాల్పులు జరిగిన ఘటన స్థానిక పోలీస్ స్టేషన్‌కు 200 మీటర్ల దూరంలోనే ఉండటం గమనార్హం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేశారు.
మృతురాలిని 21 ఏళ్ల రోషిణి అహిర్వార్‌గా గుర్తించారు. ఆమె రామ్ లఖన్ పటేల్ మహా విద్యాలయలో బీఏ చదువుతోంది. కాలేజీ నుంచి తిరిగి వస్తుండగా సోమవారం ఉదయం 11 గంటలకు దుండగులు ఒక్కసారిగా కాల్పులు జరిపి ఆమెను చంపేశారు. బజాజ్ పల్సర్‌పై వచ్చి కంట్రీమేడ్ తుపాకీతో ఆమెపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.

దుండగులను పట్టుకునేందుకు స్థానికులు ప్రయత్నించారు కానీ.. తుపాకులు చూసి అడ్డుకోలేకపోయారు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేశారు. అతడ్ని విచారిస్తున్నారు.
Jalaun: बीए की छात्रा की बीच बाजार गोली मारकर हत्या, कॉलेज से पेपर देकर लौट रही थी
— Santosh kumar Yadav (@SantoshYKT) April 17, 2023
यूपी के जालौन जिले में सोमवार को बीए प्रथम वर्ष की छात्रा की सरेआम गोली मारकर हत्या का सनसनीखेज मामला सामने आया है। बीए प्रथम वर्ष की छात्रा 21 वर्षीय रोशनी पुत्री मान सिंह अहिरवार, एट के राम लखन… pic.twitter.com/WvhgwG6JA8
కాగా, యువతి రక్తపు మడుగులో ఉన్న దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై విపక్షాలు మండిపడుతున్నాయి. శాంతిభద్రతలు కాపాడటంలో విఫలమయ్యారంటూ ధ్వజమెత్తుతున్నారు. కొద్ది రోజుల క్రితమే గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్‌ను ముగ్గురు దండుగులు కాల్చి చంపిన ఘటన మరువక ముందే మరో ఘటన చోటు చేసుకుందని విమర్శిస్తున్నారు. అతీక్ హత్యను సెలబ్రేట్ చేసుకున్నారని.. ఈ హత్యను కూడా అలాగే చూస్తారా? అని బీజేపీపై ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications