వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓ వైపు సీబీఐ దాడులు: లండన్ చెక్కేసిన చిదంబరం కొడుకు కార్తీ

కేంద్ర ఆర్థిఖశాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పీ చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం లండన్ వెళ్లిపోయారు. అవినీతి, లంచం ఆరోపణల కేసుకు సంబంధించి రెండు రోజులుగా ఆయన ఇంటితోపాటు బంధువుల ఇళ్లల్లో

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిఖశాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పీ చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం లండన్ వెళ్లిపోయారు. అవినీతి, లంచం ఆరోపణల కేసుకు సంబంధించి రెండు రోజులుగా ఆయన ఇంటితోపాటు బంధువుల ఇళ్లల్లో కూడా సీబీఐ అధికారులు సోదారులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

కాగా, ఈ నేపథ్యంలో ఆయన లండన్ వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తన కుమారుడు కార్తీ చిదంబరం ఉన్నపళంగా ఇప్పటికిప్పుడు అనుకున్న ప్రయాణం కాదని, ఇంతకుముందే పెట్టుకున్న షెడ్యూల్ ప్రకారం లండన్ వెళ్లినట్లు తండ్రి చిదంబరం స్పష్టం చేశారు.

Days after CBI raid, Karti Chidambaram leaves for London

ట్రావెలింగ్ ప్లాన్ ప్రకారమే కార్తీ వెళుతున్నాడని, కొద్ది రోజుల తర్వాత మళ్లీ తిరిగి వస్తాడని ఆయన తెలిపారు. అంతేగాక, కార్తీపై ఎలాంటి ట్రావెల్ బ్యాన్ లేదని చెప్పారు. గత మంగళవారం సీబీఐ అధికారులు కార్తీ నివాసంతోపాటు ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు.

తన తండ్రి చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఇంద్రాణి, పీటర్ ముఖర్జియాకు సంబంధించిన మీడియా కంపెనీ నుంచి పెద్ద మొత్తంలో లంచం తీసుకుని, వారి కంపెనీలకు అనుమతులిప్పించారనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సీబీఐ అధికారులు ఈ దాడులు నిర్వహిస్తున్నారు. అంతేగాక, త్వరలోనే కార్తీ చిదంబరంకు సీబీఐ నోటీసులు కూడా జారీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

English summary
Two days after the Central Bureau of Investigation raided him, Karti Chidambaram, the son of former Union Finance Minister, P Chidambaram has left for London.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X