పాకిస్థాన్ జిందాబాద్ పై డీకే క్లారిటీ, దేశాన్ని నాశనం చేస్తున్న బీజేపీ ?, వాళ్ల స్కెచ్ వేరు, తెలుసా !
బెంగళూరులోని విధానసౌదాలో ఎవరూ పాకిస్థాన్ జిందాబాద్ అని నినాదాలు చేయలేదని, పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తే పోలీసులు తన్ని లోపల పెడతారని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం విధానసౌదలో రాజ్యసభ సభ్యుడు నాసిర్ హుస్సేన్ మద్దతుదారులు పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారని బీజేపీ చేసిన ఆరోపణపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారని డీకే శివకుమార్ మీడియాకు చెప్పారు.
బుధవారం బెంగళూరులో మీడియాతో మాట్లాడిన డీకే శివకుమార్ విధాన సౌధలో రాద్దాంతం జరిగిందని వస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చారు. రాజకీయంగా లబ్ది పొందేందుకు బీజేపీ ఆ నినాదాలను వక్రీకరించుకుంటోందని డీకే శివకుమార్ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో, ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో ఓడిపోయామన్న నైరాశ్యంతో బీజేపీ ఇలా చేస్తోందని డీకే శివకుమార్ ఆరోపించారు. దీనిపై విచారణ జరపాలని సూచించామని, విచారణ అనంతరం బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని డీకే శివకుమార్ అన్నారు.

అసత్య ప్రచారం చేస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీకే శివకుమార్ హెచ్చరించారు. హిమాచల్‌ప్రదేశ్‌కు డీకే శివకుమార్ పరిశీలకుడిగా వెళ్లడంపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు. హిమాచల్ ప్రదేశ్ కు వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నాకు చెప్పిందని, దాని ప్రకారమే వెళ్తున్నానని చెప్పారు. రెండు మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ తొందరపడుతోందని డీకే శివకుమార్ అన్నారు.
ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్ష పార్టీ ఉండాలని, దేశంలో బీజేపీ ఒక చెడు సంప్రదాయాన్ని అనుసరిస్తోందని, మా పార్టీ ఎమ్మెల్యేలంతా మా వెంటే ఉంటారని డీకే శివకుమార్ ధీమా వ్యక్తం చేశారు. తాను కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉంటానన్న నమ్మకం నాకు ఉందని డీకే శివకుమార్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తనకు అప్పగించిన పని ఏదైనా తాను చేస్తానని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మీడియాకు చెప్పారు.

ఆరున్నర కోట్ల మంది కన్నడిగుల గుండెకాయ అయిన విధానసౌధలో పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన ద్రోహులను వెంటనే అరెస్ట్ చేయాలని జేడీఎస్ డిమాండ్ చేసింది. రాజ్యసభ నూతన సభ్యుడిగా ఎన్నికైన సయ్యద్ నాసిర్ హుస్సేన్ మద్దతుదారులు దేశ వ్యతిరేక నినాదాలు చేశారనే ఆరోపణపై జేడీఎస్ బెంగళూరు నగర విభాగం అధ్యక్షుడు హెచ్‌ఎం రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో బెంగళూరులోని ఫ్రీడం పార్క్ వద్ద బుధవారం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.
వేలాది మంది జేడీఎస్ కార్యకర్తలు ధర్నాలో, నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. పాకిస్థాన్ కు మద్దతుగా నినాదాలు చేసిన నిందితులకు వ్యతిరేకంగా, వారిని విధానసభకు తీసుకువచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు నాసిర్ హుస్సేన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారని బీజేపీ, జేడీఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై విచారణకు ఆదేశించామని ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, హోం మంత్రి డాక్టర్ జీ పరమేశ్వర్ మీడియాకు చెప్పారు.












Click it and Unblock the Notifications