వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘మహంకాళి’ అంటూ శిశువు మృతిదేహానికి పూజలు

|
Google Oneindia TeluguNews

లక్నో: నల్లటి ముఖ వర్ణంతో పుట్టిన ఓ శిశువును మహంకాళి రూపంగా భావించిన అక్క ప్రజలు పూజలు చేస్తున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లో చోటు చేసుకుంది.

ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. బలరాంపూర్ గ్రామానికి చెందిన కృష్ణ అనే మహిళకి ఆడపిల్ల పుట్టింది. పాప శరీరం తెల్లగా మొహం మాత్రం నల్లగా ఉంది. అయితే పాప పుట్టిన అరగంటలోపే మృతి చెందింది.

కాగా, ఆ శిశువు వింతగా ఉండటంతో ఆమెను పూడ్చకుండా ఉంచేశారు. అంతేగాక, కాళీమాత రూపంలో పుట్టిందంటూ ఊరు ఊరంతా వచ్చి ఆమె చూడటానికి బారులు తీరుతున్నారు. ఎవరికి తోచినంత డబ్బు అక్కడ వేసి పూజలు చేస్తున్నారు.

Dead infant worshipped as god in uttar pradesh

అంతటితో ఆగకుండా వారి ఇంట్లోనే భజనలు, కీర్తనలు కొనసాగిస్తున్నారు. దీంతో పూజ చేసిన పూలు, నగదుతోనే సాంప్రదాయం ప్రకారం పాప మృతదేహాన్ని ఖననం చేయాలని గ్రామ పెద్దలు నిర్ణయించారు.

ఇది ఇలా ఉండగా, పాప ఖననం తమ గ్రామంలో జరగాలంటే తమ గ్రామంలో జరగాలని పాప తండ్రి తరపు వారు, తల్లి తరపు వారు గొడవలకు దిగారు. దీంతో పాప అంత్యక్రియలు నిలిచిపోయాయి.

English summary
Dead infant worshipped as god in uttar pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X