ఏపీలో ప్రైవేట్ ట్రావెల్స్ కు షాక్ ..! ఇక స్పీడ్ లిమిట్ ఇదే..!

ఏపీలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు (Private Travels Buses) ప్రభుత్వం (AP govt) భారీ షాకులిస్తోంది. వరుస ప్రమాదాలలతో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో ప్రైవేట్ బస్సుల వేగానికి కళ్లెం వేసింది. స్పీడ్ లిమిట్స్ ను విధించింది. అలాగే ఈ స్పీడ్ లిమిట్ ను అమలు చేస్తున్నారా లేదా తెలుసుకునేందుకు జీపీఎస్ ట్రాకింగ్ చేస్తోంది. స్పీడ్ లిమిట్ ఉల్లంఘించిన బస్సుల్ని సీజ్ చేస్తోంది. దీంతో రాష్ట్రంలో ప్రైవేట్ బస్సుల ఆగడాలకు చెక్ పడుతోంది.

రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న ప్రైవేట్ బస్సుల ప్రమాదాలకు వేగమే ప్రధాన కారణమని గుర్తించిన ప్రభుత్వం ఇకపై 80 కిలోమీటర్లకు మించి వెళ్లకుండా ఆంక్షలు విధించింది. ఏపీ రిజిస్ట్రేషనన్ బస్సులతో పాటు రాష్ట్రం మీదుగా రాకపోకలు సాగించే ప్రైవేటు బస్సులకూ ఈ నిబంధన వర్తిస్తుంది. బస్సులు నిర్ణీత వేగంతోనే వెళ్తున్నాయా లేదా లైవ్ లో తెలుసుకునేందుకు జీపీఎస్ ట్రాకింగ్ అమలు చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో ప్రయాణించే 1800 బస్సుల్లో 1660 బస్సులు దారిలోకి వచ్చేశాయి.

AP Govt Enforces Strict 80kmph Speed Limit amp amp Live GPS Tracking for All Private Travel Buses

రాష్ట్రంలో ప్రయాణిస్తున్న బస్సులతో పాటు ఇతర రాష్ట్రాలకు ఇక్కడి నుంచి వెళ్తున్న బస్సులకు సైతం ఈ 8ఎస్ ట్రాకింగ్ ద్వారా గుర్తించి, ఆ సమాచారంతో బస్సులు సీజ్ చేసి ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లకు పంపుతున్నారు. అక్కడ స్పీడ్ లిమిట్ పరికరాలు పనిచేస్తున్నాయా లేదా చూస్తారు. అవి పనిచేయకపోతే చర్యలు తప్పవు. ఇలా వరుస నియంత్రణతో ప్రైవేట్ బస్సుల వేగానికి బ్రేకులు వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+