కల్తీ నెయ్యి అసలు దోషి ఆయనే - విచారణలో కీలక అంశాలు, ప్రభుత్వానికి నివేదిక..!!
సంచలనం రేపిన తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారం పైన ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. లడ్డూ వ్యవహారంలో వచ్చిన ఆరోపణలు.. ఎక్కడ లోపం జరిగిందీ.. దీనికి బాధ్యులు ఎవరో తేల్చింది. అధికారుల పాత్ర పైన వివరంగా నివేదికలో పేర్కొంది. చేయాల్సిన మార్పులను సూచించింది. కాగా, ఇప్పుడు ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తీసుకునే చర్యల పైన ఉత్కంఠ నెలకొంది.
తిరుమల లడ్డూ వ్యవహారంలో చోటు చేసుకున్న పరిణామాలు.. బాధ్యులను గుర్తిస్తూ ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమీషన్ నివేదిక సమర్పించింది. సర్కారు నియమించిన రిటైర్డ్ చీఫ్ సెక్రెటరీ దినేశ్‌కుమార్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ కల్తీ నెయ్యి సరఫరా విషయంలో నాటి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ దోషి అని తేల్చింది. నెయ్యి టెండర్ల నిబంధనలను కఠినతరం చేసిన వ్యక్తే, వాటిని మరింత సులభతరం చేయటంతో..దానివల్లే అక్రమాలకు పెద్ద ఎత్తున ఆస్కారం ఏర్పడిందని, అక్రమార్కులు విజృంభించారని నిర్ధారించింది. అధికారుల వైఫల్యాల ను ఎత్తిచూపుతూ, వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చింది. అనేక అంశాలపై సమగ్ర పరిశీలన చే సి నివేదిక రూపొందించి సమర్పించిన నివేదికలో నిబంధనల సడలింపు వల్లే కల్తీనెయ్యి సరఫరాకు ఆస్కారం ఏర్పడిందని, ఇందులో నాటి టీటీడీ ఈవో, ఐఏఎస్ అధికారి అనిల్‌కుమార్ సింఘాల్ పాత్ర ఉందని విచారణ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నట్లు తెలిసింది.

ప్రభుత్వానికి నివేదిక.. చర్యలకు సిఫారసు
కాగా,నిబంధనల సడలింపు ఉద్దేశ్యపూర్వకంగా చేసినా, చేయకపోయినా తప్పు అయితే జరిగిందని, దీని వల్లే కల్తీనెయ్యి సరఫరాకు అవకాశం ఏర్పడిందని ఆ నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. ఈవోకు దిశానిర్దేశం చేయాల్సిన కొనుగోలు విభాగం వైఫల్యం ఉందని కూడా తెలిపినట్టు సమాచారం. నాటి కొనుగోలు విభాగం జనర ల్ మేనేజర్, ఫైనాన్షియల్ అడ్వయిజర్ అండ్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ (ఎఫ్‌ఏసీఏవో) వైఫల్యాలు, త ప్పులు ఉన్నాయని కూడా నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో బాధ్యులైన అధికారులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని దినేశ్‌కుమార్ సిఫారసు చేసినట్లు తెలిసింది. టీటీడీలో నెయ్యి సహా ఇతర కీలకమైన పదార్ధాల కొనుగోలు విధానం, టెండర్లు, నిబంధనలు మరింత కఠినతరం చేయాలని కమిషన్ సిఫారసు చేసినట్లు తె లిసింది. టెండర్ నిబంధనల ప్రకారం ఏది తక్కువ ధరకు లభిస్తే దాన్ని ఎంపిక చేయడం అన్ని అంశాల్లో సరైన పద్ధతి కాదని, అలా చేసినందువల్లే టీటీడీలో కల్తీనెయ్యికి ఆస్కారం ఏర్పడిందని క మిషన్ స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇప్పటికే సీబీఐ సిట్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం టీటీడీ ఈవోగా అనిల్ సింఘాల్‌ను తప్పించింది. ఇప్పటి వరకు సింఘాల్‌కు పోస్టింగ్ లేదు, వెయిటింగ్‌లోనే ఉన్నారు. ఇక, ఇప్పుడు సింఘాల్ పైన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే ఉత్కంఠ కొనసాగుతోంది.













Click it and Unblock the Notifications