సభకు మోడీ: నోట్ల రద్దు కుంభకోణం కాదని వెంకయ్య, వార్దాపై చర్చ
నాలుగు రోజుల విరామం అనంతరం పార్లమెంటు సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి.
న్యూఢిల్లీ: నాలుగు రోజుల విరామం అనంతరం పార్లమెంటు సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. లోకసభలో పెద్ద నోట్ల రద్దు అంశంపై చర్చ చేపట్టాలని విపక్షాలు ఆందోళనకు దిగడంతో స్పీకర్.. సభను వాయిదా వేశారు. కాగా, ప్రధాని నరేంద్ర మోడీ లోకసభకు హాజరయ్యారు.
పెద్ద నోట్ల రద్దుపై లోకసభలో చర్చ జరగాలని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలపై మాట్లాడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు.
కుంభకోణం కాదు
దేశ భవిష్యత్ కోసమే పెద్ద నోట్ల రద్దు నిర్ణయమని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. డిజిటల్ లావాదేవీలు ప్రోత్సహించడం నల్లధనంపై యుద్ధమే అవుతుందని చెప్పారు. నోట్ల రద్దులో ఎలాంటి కుంభకోణం లేదని తేల్చి చెప్పారు. చర్చ నుంచి కాంగ్రెస్ పార్టీ పారిపోతోందని దుయ్యబట్టారు.

వార్ధాపై చర్చ
రాజ్యసభలో మాత్రం వార్ధా పెను తుఫానుపై చర్చ జరుగుతోంది. అంతకుముందు
మాజీ ఎంపీ శివలాల్ మృతికి రాజ్యసభ సంతాపం తెలిపింది. ఆ తర్వాత తమిళనాడుపై వార్ధా తీవ్ర ప్రభావంపై చర్చ జరిగింది. వార్ధా తుఫాను కారణంగా తమిళనాడు తీవ్రంగా నష్టపోయిందని, కేంద్రం తక్షణమే స్పందించి సాయం చేయాలని మాజీ కేంద్రమంత్రి చిదంబరం కోరారు.
సీపీఎం సభ్యుడు డీ రాజా మాట్లాడుతూ.. తుఫాను ప్రభావంతో తమిళనాడు పూర్తిగా దెబ్బతిందని అన్నారు. తమిళనాడుకు వెంటనే వెయ్యి కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనికి స్పందించిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. తమిళనాడును అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications