భారత్‌పై చైనా అక్కసు: ఆర్థిక వేర్పాటువాదం: అతిపెద్ద ట్రేడ్ పార్ట్‌నర్: మాతో పెట్టుకుంటే:

న్యూఢిల్లీ: లఢక్ సమీపంలో వాస్తవాధీన రేఖ వద్ద చోటు చేసుకున్న పరిణామాల అనంతరం భారత్-చైనా మధ్య సంబంధాలు దెబ్బ తిన్నాయి. ఈ రెండు దేశాల మధ్య తలెత్తిన సరిహద్దు వివాదాలు ఉద్రిక్తతలకు దారి తీశాయి. కిందటి నెల 15, 16 తేదీల్లో గాల్వన్ వ్యాలీ వద్ద రెండు దేశాల సైనికులు పరస్పరం ప్రాణాంతక దాడులకు దిగడం యుద్ధ సన్నాహాలకు కారణమైంది. దీనికి ప్రతీకారంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని చర్యలు.. చైనాను ఆర్థికంగా దెబ్బతీశాయి. చైనాలో తయారైన యాప్స్‌ను నిషేధించడం, వాణిజ్యపర సంబంధాలను తెంచుకోవడం వంటి నిర్ణయాలు చైనాను ప్రభావితం చేశాయి.

అతిపెద్ద ట్రేడ్ పార్ట్‌నర్..

అతిపెద్ద ట్రేడ్ పార్ట్‌నర్..

దీనిపై భారత్‌లోని చైనా రాయబారి సన్ వెడాంగ్ తాజాగా స్పందించారు. భారత చర్యలన్నీ ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చైనీస్ స్టడీ‌స్‌కు చెందిన ఓ వెబినార్‌తో ఆయన మాట్లాడారు. భారత్ గానీ, చైనా గానీ ప్రపంచ దేశాలతో ఆర్థిక సంబంధాలను కొనసాగిస్తున్నాయని, అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ రెండు దేశాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయని చెప్పారు. 2018-2019 ఆర్థిక గణాంకాల ప్రకారం..భారత్ 92 శాతం కంప్యూటర్లు, 82 శాతతం టీవీలు, 80 శాతం ఆప్టికల్ ఫైబర్, 85 శాతం బైక్ స్పేర్ పార్టులను చైనా నుంచి దిగుమతి చేసుకుందని గుర్తు చేశారు.

 32 శాతం పురోభివృద్ధి

32 శాతం పురోభివృద్ధి

భారత్ చైనా మధ్య ఆసియా ఉపఖండంలో చోటు చేసుకున్న వ్యాపార కార్యకలాపాల్లో 32 శాతం పురోభివృద్ధి చోటు చేసుకుందని సన్ వెడాంగ్ అన్నారు. 100 బిలియన్ డాలర్ల మేర వాణిజ్య కార్యకలాపాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు. భారత్‌కు అతిపెద్ద ట్రేడ్ పార్ట్‌నర్‌గా చైనా వ్యవహరిస్తోందని, అలాంటి దేశంతోనే తెగదెంపులు చేసుకోవడం సరికాదని అన్నారు. భారత చర్యలన్నీ ప్రపంచీకరణ, డబ్ల్యూటీఓ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పారు. మొబైల్ ఇండస్ట్రీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఆటోమొబైల్,హెల్త్ ఇన్‌ఫ్రాల్లో రెండు దేశాల మధ్య వానిజ్య సంబంధ కార్యకలాపాలు కొనసాగి తీరాల్సిన అవసరం ఉందని అన్నారు.

Recommended Video

    తండ్రైన Hardik Pandya,తల్లీ బిడ్డా క్షేమం | Natasa Stankovic | Oneindia Telugu
     చైనా ఆటో కంపెనీలపై ఆంక్షల ప్రభావం జర్మనీ దాకా ..

    చైనా ఆటో కంపెనీలపై ఆంక్షల ప్రభావం జర్మనీ దాకా ..

    తమ దేశానికి చెందిన ఆటో కంపెనీలపై భారత ప్రభుత్వం విధించిన ఆంక్షల ప్రభావం.. జర్మనీపై పడిందని సన్ వెడాంగ్ అన్నారు. ఈ ఆంక్షల ప్రభావం జర్మనీలోని ఆటోమేకర్స్ ప్రొడక్షన్ సంస్థలపై తీవ్రంగా పడిందని అన్నారు. ఈ విషయాన్ని భారత్‌లో పనిచేస్తోన్న జర్మనీ స్నేహితుడొకరు తనకు చెప్పారని వెడాంగ్ తెలిపారు. భారత్ అనుసరిస్తోన్న స్వీయ రక్షణ, ఆంక్షలతో కూడిన సంబంధాలను కొనసాగించడం, నాన్ టారిఫ్ బ్యారియర్స్ వంటి చర్యలు ఏ దేశానికీ మంచివి కావని వెడాంగ్ చెప్పారు. అవన్నీ డబ్ల్యూటీఓ నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తాయని చెప్పారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+