జయ మేనకోడలు దీపా మిస్సింగ్, ఫిర్యాదు: ఏమైయ్యింది ?

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా రెండు రోజుల నుంచి (సోమవారం) కనపడటం ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. జయలలిత సొంత చెల్లెలు శైలజ కుమార్తె అమృత ఈ ఆరోపణలు చెయ్యడంతో అందరూ షాక్ .

బెంగళూరు/చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సోదరుడు జయకుమార్ కుమార్తె దీపా జయకుమార్ రెండు రోజుల నుంచి కనపడటం లేదని వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. జయలలిత సొంత చెల్లెలు శైలజ కుమార్తె అమృత ఈ ఆరోపణలు చెయ్యడంతో అందరూ షాక్ కు గురైనారు.

జయలలిత చెల్లెలు శైలజ బెంగళూరులో నివాసం ఉండే వారు. శైలజ కుమార్తె అమృత. శైలజ కొన్ని సంవత్సరాల క్రితం మరణించారు. జయలలిత సోదరుడు జయకుమార్ కుమార్తె దీపా చెన్నైలో నివాసం ఉంటున్నారు. జయలలితకు తానే వారసురాలు, ఆమె పోయెస్ గార్డెన్ తనకు ఇవ్వాలని దీపా కొన్ని రోజుల నుంచి చెబుతున్న విషయం తెలిసిందే.

Deepa Jayakumar's Chennai house was locked and her maid wasn’t around either.

ఇదే సమయంలో దీపా కనపడటం లేదని అమృత ఆరోపణలు చెయ్యడంతో కథ కొత్త పలుపుతిరిగింది. అమృత బెంగళూరు మిర్రర్ అనే ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.

జయలలితకు మళ్లీ అంత్యక్రియలు: ఆత్మశాంతించాలని

నేను దీపా చిన్నప్పటి నుంచి చనువుగా ఉంటున్నామని, ప్రతి రోజు ఫోన్ లో మాట్లాడుకుంటామని చెప్పారు. మా పెద్దమ్మ (జయలలిత) ఆసుపత్రిలో చేరిన తరువాత ఎక్కువగా ఫోన్ లో మాట్లాడుకుంటున్నామని, ఆమె ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుంటున్నామని అన్నారు.

జయలలిత మరణించిన తరువాత దీపా తానే మా అత్త జయ వారసురాలు అని మీడియాకు చెప్పారని, అందుకు తాము మద్దతు ఇచ్చామని గుర్తు చేశారు. శశికళకు వ్యతిరేకంగా తామిద్దరం మీడియా ముందు మాట్లాడామని చెప్పారు.

Deepa Jayakumar's Chennai house was locked and her maid wasn’t around either.

ఈ విషయంపై మాట్లాడటానికి నన్న చెన్నై రావాలని, ఇక్కడే ఆ విషయంపై చర్చిద్దాం అని దీపా పిలిచిందని అమృత చెప్పింది. సోమవారం తాను చెన్నై వెళ్లి చూడా ఆమె ఇంటికి తాళం వేసిందని, ఇంటిలో పని చేస్తున్న వారు లేరని అమృత ఆరోపించారు.

జయలలిత ఆత్మ 'ప్రేతాత్మ'అయ్యి తిరుగుతుందంట !

దీపాకు అప్పటి నుంచి ఫోన్ చేస్తుంటే నిత్యం అందుబాటులో లేరని (నాట్ రీచబుల్ ) అని సమాధానం వస్తుందని, ఆమెకు ఏమైయ్యింది ? అని ఆందోళనగా ఉందని అమృత ఆంగ్ల దినపత్రికకు చెప్పింది.

Deepa Jayakumar's Chennai house was locked and her maid wasn’t around either.

శశికళ అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు చేపట్టిన తరువాత మనకు కష్టాలు ఎక్కువ అవుతాయని దీపా ఇంతకు ముందే మాకు చెప్పిందని అమృత గుర్తు చేశారు. దీపా ఎక్కడ ఉన్నా ఆమె క్షేమంగా ఉండాలని ఆదేవుడిని, మా పెద్దమ్మ జయలలితను ప్రార్థిస్తున్నానని అమృత చెప్పారు.

చెన్నైలో గత రెండు రోజుల నుంచి భారీగా వర్షం పడుతోంది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇప్పుడిప్పుడే అంధకారంలో నుంచి చెన్నై నగరం బయటపడుతోంది. ఎక్కడిక్కడ వాహన సంచారం స్థంభించింది.

Deepa Jayakumar's Chennai house was locked and her maid wasn’t around either.

వర్ద తుపాను, భారీ వర్షాల కారణంగా దీపా ఎక్కడైనా స్నేహితుల ఇంటిలో ఉండిపోయారా ? కరెంట్ లేకపోవడంతో ఆమె మొబైల్ స్విచ్ ఆఫ్ అయ్యిందా ? అసలు ఏమి జరిగింది ? అనే విషయం వెలుగు చూడవలసి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+