జయలలిత మేనకోడలు దీపాకు ఊహించని దెబ్బ: 34వ స్థానంలో !

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా అభిమానులు, అనుచరులు ఆందోళనకు గురౌతున్నారు. ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో దీపా విజయం సాదిస్తారా ? లేదా ? అనే అనుమానం ఆమె అనుచరుల్లో మొదలైయ్యింది.

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ అభిమానులు, అనుచరులు ఆందోళనకు గురౌతున్నారు. ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో దీపా విజయం సాదిస్తారా ? లేదా ? అనే అనుమానం ఆమె అనుచరుల్లో మొదలైయ్యింది.

Deepa's name has been placed 34th in Candidates list in the EVM in RK Nagar by election.

జయలలిత మరణంలో ఆర్ కే నగర్ శాసన సభ నియోజక వర్గం ఖాళీ అయ్యింది. ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో జయలలిత మేనకోడలు దీపా తను స్థాపించిన ఎంజీఆర్ అమ్మ దీపా పేరవై పేరుతో పోటీ చేస్తున్నారు. అన్నాడీఎంకే అమ్మ పేరుతో టీటీవీ. దినకరన్ పోటీ చేస్తున్నారు.

అన్నాడీఎంకే పార్టీ రెబల్ నాయకుడు పన్నీర్ సెల్వం వర్గం నుంచి మధుసూదనన్ పోటీ చేస్తున్నారు. ఇప్పుడు అన్నాడీఎంకే పార్టీ ఓట్లు మూడుగా చీలిపోయాయి. ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో మొత్తం 62 మంది పోటీ చేస్తున్నారు.

ఎన్నికల అధికారులు ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల సీరియల్ నెంబర్ల లిస్ట్ ప్రకటించారు. దీపాకు ఈవీఎంలో 34వ స్థానం కేటాయించారు. ఎన్నికల అధికారులు కేటాయించిన సీరియల్ నెంబర్ ప్రకారం ఓటర్లు దీపాకు ఓటు వెయ్యాలంటే 34వ బటన్ దగ్గరకు వచ్చి ఓటు వెయ్యాలని. 34 నెంబర్ వరకు ఓపికగా ఓటర్లు పరిశీలిస్తారా అంటూ దీపా అనుచరులు ఆందోళనకు గురౌతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+