పట్టాలు తప్పిన జనతా: 30 మంది మృతి, 150 మంది క్షతగాత్రులు
హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రైలు ప్రమాదం సంభవించింది. రాయ్‌బరేలీలో డెహ్రాడూన్ - వారణాసి జనతా ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 30 మంది మృతి చెందగా, మరో 150 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం రాయ్‌బరేలి బచ్రాన్ రైల్వే స్టేషన్ సమీపంలోని బచ్రావాన్ వద్ద శుక్రవారం ఉదయం జరిగింది. లోకోమోటివ్ బ్రేక్స్ విఫలం కావడంతో ఈ ప్రమాదం సంభవించింది.

సంఘటనా స్థలానికి అధికారులు చేరుకుంటున్నారని సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు మనోజ్ కుమార్ పాండే చెప్పారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అన్ని రకాల చర్యలూ తీసుకుంటుందని చెప్పారు. నిజానికి, రైలును ఆపే సమయంలో ప్రమాదం జరిగింది.
ప్రమాదంలో ఇంజిన్‌తో పాటు రెండు కంపార్టుమెంట్లు దెబ్బ తిన్నాయి. రెండు కోచ్‌లు ఒక్కదాన్నొక్కటి ఢీకొట్టాయి. వాటిలో ఒకటి జనరల్ కంపార్టుమెంటు కాగా, మరోటి గార్డ్ కంపార్ట్‌మెంట్. ప్రమాదం జరిగిన బచ్రావాన్ ప్రాంతం రాయబరేలీకి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications