G20 summit: వెండి కంచాల్లో భోజనం- బంగారం స్పూన్లు: వడ్డనకు పసిడి పాత్రలు
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల్లో అత్యున్నత భేటీల్లో ఒకటిగా భావించే జీ20 హై ప్రొఫైల్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. దీనికి సంబంధించిన కోలాహలం దేశంలో నెలకొంది. దేశ రాజధానిలో 8, 9,10 తేదీల్లో ఈ సమ్మిట్ జరుగబోతోంది. దీనికోసం ఢిల్లీ ముస్తాబైంది. నగరంలోని ప్రఖ్యాత కట్టడాలన్నింటినీ మువ్వన్నెల వెలుగులతో అలంకరించారు.
జీ20లో భారత్ సహా అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, బ్రిటన్, అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు ఇందులో సభ్యులుగా కొనసాగుతున్నాయి. ఆయా దేశాల ప్రతినిధులందరూ వచ్చే సంవత్సరం భారత్‌లో జరిగే జీ20 శిఖరాగ్ర సదస్సుకు హాజరు కావాల్సి ఉంది.

ఈ ప్రతిష్ఠాత్మక జీ20 సదస్సులో పాల్గొనడానికి జో బైడెన్.. భారత్‌కు రానున్నారు. ఆయన పర్యటన ఖరారైనట్లు ఇదివరకే వైట్ హౌస్ వెల్లడించింది. సెప్టెంబర్ 7 నుంచి 10వ తేదీ వరకు బైడెన్ భారత్‌లో పర్యటిస్తారు. 7వ తేదీన ఆయన భారత్‌కు చేరుకుంటారు. ఆయన వెంట అమెరికా విదేశాంగ, రక్షణ, వాణిజ్యం, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు ఉంటారు.
జీ20లో సభ్య దేశంగా కొనసాగుతున్న చైనా అధినేత గ్ఝి జిన్‌పింగ్.. ఈ సమావేశానికి డుమ్మా కొట్టారు. ఆయన హాజరు కావట్లేదు. చైనా తరఫున ఆ దేశ ప్రధాన మంత్రి లి కియాంగ్ హాజరవుతారు. ఆయన ఎందుకు జీ20 సదస్సుకు హాజరు కాలేకపోతున్నారనే విషయంపై స్పష్టత రాలేదు.
కాగా- జీ20 సదస్సుకు ఆతిథ్యాన్ని ఇవ్వనున్నందున ఢిల్లీ ప్రభుత్వం మూడు రోజుల పాటు పాఠశాలలు, కళాశాలలకు సెలవును ప్రకటించింది. సదస్సు జరిగే మార్గాల్లో వాహనాలన్నింటినీ దారి మళ్లించింది. ఎలాంటి గందరగోళం లేకుండా ఈ సమావేశాలు సజావుగా సాగాలనే ఉద్దేశంతో సెలవును ప్రకటించినట్లు తెలిపింది.

కాగా-ఈ సమావేశానికి హాజరయ్యే ప్రతినిధులందరికీ వెండి కంచాల్లో భోజనాలను వడ్డించనుంది కేంద్ర ప్రభుత్వం. దేశీయ, విదేశీ వంటకాలతో అద్దిరిపోయే మెనూను సిద్ధమౌతోంది. 20 దేశాధినేతలు, ప్రధానమంత్రులు, అధికారులు పాల్గొనబోతోన్న నేపథ్యంలో ఆయా దేశాల వంటకాలన్నింటినీ అదరగొట్టనున్నాయి. వాటిని వెండి కంచాలు, బంగారం స్పూన్లతో సర్వ్ చేయడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.
దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 200 మంది కళాకారులు ఈ వెండి కంచాలు, బంగారం పాత్రలు, స్పూన్లతో తయారు చేశారు. 15,000 వెండి వస్తువులను కేంద్ర ప్రభుత్వం ఈ సమ్మిట్‌లో భోజనాల కోసం వినియోగించనుంది. మొత్తంగా వాటిని రూపొందించడానికి 50,000 గంటల పని సమయం పట్టింది.












Click it and Unblock the Notifications