ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు 2025 LIVE :ముక్కోణపు పోటీలో విజేత ఎవరు..?
ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు 2025 ఫిబ్రవరి 5వ తేదీన జరిగాయి.మొత్తం 70 స్థానాలకు ఒకేసారి పోలింగ్ జరిగింది. ఢిల్లీ రాష్ట్రంలో ముక్కోణపు పోటీ నెలకొంది. అరవింద్ కేజ్రీవాల్ ఆప్ పార్టీతో పాటు బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్య హోరా హోరీ పోరు జరిగిందనే చెప్పాలి. గత రెండు ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ పార్టీ హవా కొనసాగగా ఈ సారి మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకి ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది.2020లో 62 సీట్లు, 2015లో 67 సీట్లు నెగ్గి ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుంది.
ఒకప్పుడు ఢిల్లీని శాసించిన కాంగ్రెస్ పార్టీ... తన మనుగడే ప్రశ్నార్థకంగా మారింది.అయితే ఈసారి మాత్రం గట్టిపోటీనే ఇచ్చిందనే వార్తలు వస్తున్నాయి.ఫిబ్రవరి 5వ తేదీన సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగుస్తుంది. 6 గంటలలోపు క్యూలైన్లలో నిలబడ్డవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తోంది ఎన్నికల సంఘం. పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడుతాయి. అయితే లోక్‌సభ ఎన్నికలు ముగిశాక వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు, వాస్తవ ఫలితాలకు వ్యత్యాసం కనిపించింది. మరి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా ఉంటాయో వేచిచూడాలి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు సంబంధించి మినిట్-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం..

#WATCH | Voting concludes in Delhi Assembly elections; visuals from outside the Strong room in ITI Nand Nagri#DelhiElection2025 pic.twitter.com/OZBbLtC7XL
— ANI (@ANI) February 5, 2025
పీపుల్స్ ఇన్‌సైట్
People's Insight exit poll has given an edge to the BJP, while the AAP is projected to bag seats between 25-29. pic.twitter.com/50XrIOghxq
— Rudhra Nandu (@rudhranandu) February 5, 2025














Click it and Unblock the Notifications