కేజ్రీవాల్ తొలి ప్రకటనే సంచలనం కదా
Delhi Election Results 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ప్రభంజనం కనిపించింది. ఆ పార్టీ అభ్యర్థులు అన్ని చోట్లా విజయఢంకా మోగిస్తోన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ మట్టికరిచింది. హస్తినాపురిలో తన ప్రాభవాన్ని, అధికారాన్ని కోల్పోయింది. కాంగ్రెస్ బోణీ కొట్టే పరిస్థితీ కనిపించట్లేదు.
మొత్తం 70 నియోజకవర్గాలు ఉన్నాయి ఢిల్లీ అసెంబ్లీలో. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్.. 36. 2013లో తలి సారిగా దేశ రాజధానిలో జెండా పాతింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇఫ్పటివరకూ చెక్కు చెదరలేదా పార్టీ ఓటుబ్యాంక్. ఇప్పుడు ఫలితం తిరగబడే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. దీనికి అనుగుణంగా ఫలితాలు వెలువడుతున్నాయి. క్లీన్ స్వీప్ దిశగా సాగుతోంది బీజేపీ.

ఇప్పటివరకు ఓడిన వారిలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్- న్యూఢిల్లీ, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా- జంగ్‌పురా, ధరంపాల్ చందేరా- రాజౌరీ గార్డెన్, సోమ్‌నాథ్ భారతి- మాలవీయ నగర్, ప్రవీణ్ జైన్- షాలిమార్ బాగ్, దినేష్ మొహానియా - సంగం విహార్ ఉన్నారు.
ముఖ్యమంత్రి ఆతిషీ- చివరి రౌండ్‌లో గట్టెక్కారు. కల్యాజీలో బీజేపీ అభ్యర్థి రమేష్ బిధూరీపై విజయఢంకా మోగించారు. ఈ ఫలితాలు ఆమ్ ఆద్మీ పార్టీని నిరాశ నిస్పృహల్లోకి నెట్టాయి. మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసం, పార్టీ కేంద్ర కార్యాలయం బోసిపోయాయి. కంచుకోటలు సైతం కుప్పకూలిపోవడం పట్ల దిగ్భ్రాంతికి గురైందా పార్టీ. స్వయానా కేజ్రీవాలే మట్టికరవడాన్ని జీర్ణించుకోలేకపోతోంది.
ఈ ఓటమి పట్ల అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఓటమిని అంగీకరస్తోన్నానని అన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును మనస్ఫూర్తిగా గౌరవిస్తోన్నానని వ్యాఖ్యానించారు. ఘన విజయం సాధించినందుకు బీజేపీని అభినందించారు. ఎన్నికల ప్రచార సమయంలో ప్రజలకు ఇచ్చిన అన్ని వాగ్దానాలను అమలు చేస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
#WATCH | On #DelhiElection2025, AAP national convener and former Delhi CM, Arvind Kejriwal, "We accept the mandate of the people with great humility. I congratulate the BJP for this victory and I hope they will fulfil all the promises for which people have voted them. We have… pic.twitter.com/VZOwLS8OVH
— ANI (@ANI) February 8, 2025
10 సంవత్సరాల కాలంలో ఢిల్లీవాసుల కోసం అహరహం శ్రమించానని, వారికి నాణ్యమైన విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలను కల్పించడానికి కృషి చేశానని చెప్పారు. ఎన్నికల హామీలను అమలు చేసే విషయంలో ఇక ప్రతిపక్షంగా అధికార పార్టీపై ఒత్తిడి తీసుకొస్తామని, నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను పోషిస్తామని, ప్రజల మధ్యే ఉంటామని అన్నారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications