ఢిల్లీలో ఢంకా మోగించిన వేళ- తెరపై సుష్మా స్వరాజ్ కూతురు
Delhi Election Results 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ప్రభంజనం కనిపించింది. ఆ పార్టీ అభ్యర్థులు అన్ని చోట్లా విజయఢంకా మోగిస్తోన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ మట్టికరిచింది. హస్తినాపురిలో తన ప్రాభవాన్ని, అధికారాన్ని కోల్పోయింది. కాంగ్రెస్ బోణీ కొట్టే పరిస్థితీ కనిపించట్లేదు.
మొత్తం 70 నియోజకవర్గాలు ఉన్నాయి ఢిల్లీ అసెంబ్లీలో. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్.. 36. 2013లో తలి సారిగా దేశ రాజధానిలో జెండా పాతింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇఫ్పటివరకూ చెక్కు చెదరలేదా పార్టీ ఓటుబ్యాంక్. ఇప్పుడు ఫలితం తిరగబడే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. దీనికి అనుగుణంగా ఫలితాలు వెలువడుతున్నాయి. క్లీన్ స్వీప్ దిశగా సాగుతోంది బీజేపీ.

ఫలితాలు వెలువడుతున్న కొద్దీ బీజేపీలో జోష్ పెరిగింది. ఈ తెల్లవారు జాము నుంచే ఆ పార్టీ ఢిల్లీ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు. బాణాసంచా కాల్చారు. స్వీట్లను పంచిపెట్టారు. రంగులు చల్లుకున్నారు. డోలు వాయిస్తూ సందడి చేశారు. కాషాయ జెండాలను ఎగురవేశారు.
దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఢిల్లీ ప్రజలు ఇచ్చిన తీర్పును చారిత్రాత్మకమైనదిగా అభివర్ణించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి అందిస్తోన్న సుపరిపాలన, సమగ్ర దేశాభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారని వ్యాఖ్యానించారు. ఢిల్లీ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చారు.
ఈ విజయంపై భారతీయ జనతా పార్టీ లోక్‌సభ సభ్యురాలు బాన్సురి స్వరాజ్ స్పందించారు. బీజేపీ హెవీ వెయిట్, కేంద్ర మాజీ మంత్రి దివంగత సుష్మా స్వరాజ్ కుమార్తె ఆమె. గతంలో సుష్మా స్వరాజ్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా పని చేసిన విషయం తెలిసిందే. ఆమెనే ఢిల్లీలో బీజేపీకి చిట్టచివరి ముఖ్యమంత్రి.
ఢిల్లీ ఓటర్లకు బాన్సురీ స్వరాజ్ కృతజ్ఞతలు తెలిపారు. విజ్ఞతతో ఓటు వేశారని ప్రశంసించారు. మోదీ పరిపాలన కావాలని ప్రతి ఒక్క ఢిల్లీవాసి కూడా ఎంతగానో కోరుకుంటోన్నారనేది ఈ చారిత్రాత్మక విజయంతో స్పష్టమైందని వ్యాఖ్యానించారు. వారి తీర్పును గౌరవిస్తోన్నామని పేర్కొన్నారు.
ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామంటూ బాన్సురి స్వరాజ్ స్పష్టం చేశారు. బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా సారథ్యంలో పార్టీ తిరుగులేని విజయాన్ని సాధించిందని పేర్కొన్నారు. ఈ విజయానికి దోహదపడిన ప్రతి ఒక్కరికీ హృదయపూరక కృతజ్ఞతలను తెలియజేస్తోన్నానని, తమపై ఢిల్లీ ఓటర్లు ఉంచిన నమ్మకం వమ్ము కాదని అన్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications