అందరూ నిర్మలమ్మను ఆడిపోసుకున్నారు గానీ- ఇప్పుడు చూడండి ఎలా గెలిపించిందో..!!
Delhi Election Results 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ప్రభంజనం కనిపించింది. ఆ పార్టీ అభ్యర్థులు అన్ని చోట్లా విజయఢంకా మోగిస్తోన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ మట్టికరిచింది. హస్తినాపురిలో తన ప్రాభవాన్ని, అధికారాన్ని కోల్పోయింది. కాంగ్రెస్ బోణీ కొట్టే పరిస్థితీ కనిపించట్లేదు.
క్లీన్ స్వీప్ దిశగా..
మొత్తం 70 నియోజకవర్గాలు ఉన్నాయి ఢిల్లీ అసెంబ్లీలో. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్.. 36. 2013లో తలి సారిగా దేశ రాజధానిలో జెండా పాతింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇఫ్పటివరకూ చెక్కు చెదరలేదా పార్టీ ఓటుబ్యాంక్. ఇప్పుడు ఫలితం తిరగబడే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. దీనికి అనుగుణంగా ఫలితాలు వెలువడుతున్నాయి. క్లీన్ స్వీప్ దిశగా సాగుతోంది బీజేపీ.

ఓడిన వారిలో..
ఇప్పటివరకు ఓడిన వారిలో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్- న్యూఢిల్లీ, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా- జంగ్‌పురా, ధరంపాల్ చందేరా- రాజౌరీ గార్డెన్, సోమ్‌నాథ్ భారతి- మాలవీయ నగర్, ప్రవీణ్ జైన్- షాలిమార్ బాగ్, దినేష్ మొహానియా - సంగం విహార్ ఉన్నారు. ముఖ్యమంత్రి ఆతిషీ- చివరి రౌండ్‌లో గట్టెక్కారు. కల్యాజీలో బీజేపీ అభ్యర్థి రమేష్ బిధూరీపై విజయఢంకా మోగించారు.
బీజేపీలో జోష్..
ఫలితాలు వెలువడుతున్న కొద్దీ బీజేపీలో జోష్ పెరిగింది. ఈ తెల్లవారు జాము నుంచే ఆ పార్టీ ఢిల్లీ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు. బాణాసంచా కాల్చారు. స్వీట్లను పంచిపెట్టారు. రంగులు చల్లుకున్నారు. డోలు వాయిస్తూ సందడి చేశారు. కాషాయ జెండాలను ఎగురవేశారు.
నిరాశలో ఆమ్ ఆద్మీ..
మరోవంక- ఆమ్ ఆద్మీ పార్టీలో దీనికి పూర్తి భిన్నమైన వాతావరణం కనిపించింది. మూగబోయిందా పార్టీ కార్యాలయం. బోసిగా కనిపించింది. ప్రాభవాన్ని కోల్పోయింది. అటు మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసం సైతం వద్దా ఇలాంటి వాతావరణమే నెలకొంది.
కేంద్ర బడ్జెట్ కీ రోల్..
హస్తినాపురిలో బీజేపీ గెలుపులో కేంద్ర బడ్జెట్ కీలక పాత్ర పోషించిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. అదే ప్లస్ పాయింట్ అయిందనీ అంటున్నారు. వార్షిక ఆదాయం 12 లక్షల రూపాయల వరకు పన్నుల నుంచి మినహాయించడం మధ్య తరగతి కుటుంబీకులకు అతిపెద్ద ఊరటనిచ్చినట్టయింది.
అత్యధికులు ఉద్యోగులే..
నిజానికి- ఢిల్లీలో నివసించే వారిలో అత్యధికులు ఉద్యోగులే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల ఉద్యోగులు మెజారిటీ సంఖ్యలో ఉన్నారక్కడ. కేంద్ర బడ్జెట్‌లో 12 లక్షల రూపాయల వరకు పన్ను మినహాయింపును ఇవ్వడం బీజేపీ గెలవడానికి ప్రధానంగా బాటలు వేసిందని అంటున్నారు.
ఓటు రూపంలో..
ఈ నిర్ణయం వల్ల వేల సంఖ్యలో ఉద్యోగులు ఆర్థికంగా లబ్ది పొందగలుగుతారు. ఆ కృతజ్ఞతను ఓటు రూపంలో బీజేపీకి తెలియజేసినట్టయింది. మధ్య తరగతి కుటుంబాలకు చెందిన 60 శాతం వరకు ఓట్ల బీజేపీకి పోల్ అయినట్లు తెలుస్తోంది. దీనికితోడు అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, ఢిల్లీ మద్యం పాలసీలో చోటు చేసుకున్నట్లుగా చెబుతోన్న వందల కోట్ల రూపాయల అవినీతి- ఆప్ ప్రభుత్వ పతనానికి బాటలు వేసింది.
ఢిల్లీ విషపూరితం
అదే సమయంలో - ఢిల్లీ వాతావరణం విషపూరితం కావడం మరో కారణం అనే అంచనాలు ఉన్నాయి. ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ రోజురోజుకూ దిగజారిపోతోండటం, యమునా నది మొత్తం కాలుష్యమయం అయిందనేది జగమెరిగిన సత్యం. దీన్ని బీజేపీ తన ప్రచారానికి వాడుకుంది. సక్సెస్ సాధించినట్టే కనిపిస్తోంది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications