వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేస్ బుక్ ఎండీకి నోటీసులు జారీ చేసిన ఢిల్లీ అసెంబ్లీ ప్యానెల్ .. విచారణకు హాజరు కావాలని సమన్లు

|
Google Oneindia TeluguNews

సోషల్ మీడియా జెయింట్ ఫేస్ బుక్ కు ఢిల్లీ అసెంబ్లీ నోటీసులు జారీ చేసింది . ఇటీవల హేట్ కంటెంట్ విషయంలో ఫేస్ బుక్ కు పొలిటికల్ హీట్ తాకిన విషయం తెలిసిందే. అతిపెద్ద మార్కెట్ అయిన ఇండియా లో హేట్ స్పీచ్ పాలసీని మార్చినట్టు వచ్చిన ఆరోపణలు ఫేస్ బుక్ ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఈ ఆరోపణలపై విచారణకు ఆదేశించిన ఆమ్ ఆద్మీ ప్రభుత్వం కమిటీ విచారణకు ఆదేశించగా కమిటీ ఫేస్ బుక్ కు సమన్లు ఇచ్చింది .

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్.. డ్రగ్స్ కేసు.. రకుల్, సారా అలీ ఖాన్ పేర్లు చెప్పిన రియాసుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్.. డ్రగ్స్ కేసు.. రకుల్, సారా అలీ ఖాన్ పేర్లు చెప్పిన రియా

ఫేస్ బుక్ కు ఢిల్లీ అసెంబ్లీ ప్యానెల్ సమన్లు

ఫేస్ బుక్ కు ఢిల్లీ అసెంబ్లీ ప్యానెల్ సమన్లు

ఫేస్ బుక్ ను బిజెపి కంట్రోల్ చేస్తుందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో, ఢిల్లీ అసెంబ్లీ శాంతి మరియు సామరస్యపూర్వక కమిటీ ద్వేషపూరిత కంటెంట్ విషయంలో సోషల్ మీడియా సంస్థ ఫేస్ బుక్ పై వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి విచారణ జరుపుతుంది . ఫేస్ బుక్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ మోహన్ ను విచారణ నిమిత్తం హాజరు కావాలని నోటీసులిచ్చింది .

సెప్టెంబర్ 15న ఢిల్లీ విధానసభ ముందు హాజరుకావాలని నోటీసులు

సెప్టెంబర్ 15న ఢిల్లీ విధానసభ ముందు హాజరుకావాలని నోటీసులు

ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు రాజేంద్రనగర్ చెందిన ఎమ్మెల్యే రాఘవ చాదా నేతృత్వంలోని కమిటీ సెప్టెంబర్ 15న ఢిల్లీ విధానసభ ముందు ఫేస్ బుక్ మేనేజింగ్ డైరెక్టర్ హాజరుకావాలని సమన్లు జారీ చేసింది. ఫేస్బుక్ కంపెనీ హింసను ప్రేరేపించే హేట్ కంటెంట్, హేట్ స్పీచ్ విషయంలో వచ్చిన ఆరోపణలపై ఈ సమన్లు జారీ చేశామని కమిటీ శనివారం అధికారికంగా ప్రకటించింది. దీనిపై విచారణ జరుపుతున్న కమిటీ ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లు తీవ్రతరం కావడానికి ఫేస్బుక్ కారణమైందని ఆగస్టు 31వ తేదీన జరిగిన రెండో విచారణలో కమిటీ నిర్ధారించడంతో ఫేస్ బుక్ కు నోటీసులు పంపించింది.

వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్ వివాదంతోనే కమిటీ విచారణ

వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్ వివాదంతోనే కమిటీ విచారణ

వాల్ స్ట్రీట్ జర్నల్లో ఇటీవల వచ్చిన ఓ రిపోర్ట్ ఆధారంగా విచారణ చేపట్టింది కమిటీ . ఇండియాలో ఫేస్ బుక్ పబ్లిక్ పాలసీ ఎగ్జిక్యూటివ్ అంకి దాస్ బీజేపీ లీడర్ల అకౌంట్లకు హేట్ స్పీచ్ రూల్స్ అప్లై చేయడానికి వ్యతిరేకించినట్టు ఆ రిపోర్ట్ పేర్కొంది. మరో ముగ్గురు బీజేపీ లీడర్లు, గ్రూపులు వయోలెన్స్ ను ప్రోత్సహిస్తున్నట్టు ఇంటర్నల్ గా గుర్తించినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తెలిపింది వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది . బీజేపీ నేతలపై చర్యలుతీసుకున్నట్లయితే దేశంలో తమ కంపెనీ బిజినెస్ దెబ్బతింటుందని దాస్ చెప్పినట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.

 హేట్ కంటెంట్ పై వివరణ కోరిన అసెంబ్లీ ప్యానెల్

హేట్ కంటెంట్ పై వివరణ కోరిన అసెంబ్లీ ప్యానెల్

ఈ వివాదానికి కేంద్ర బిందువైన ఫేస్ బుక్ ఎగ్జిక్యూటివ్ అంకి దాస్ కూడా తనకు ప్రాణహాని ఉందంటూ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను చంపుతామంటూ సోషల్ మీడియాలో బెదిరింపులు వస్తున్నాయంటూ ఐదుగురి పేర్లను తన కంప్లయింట్లో ప్రస్తావించారు. తనను చంపుతామని బెదిరించడంతో పాటు కొందరు తనపై అభ్యంతరకర పోస్ట్‌‌‌‌‌‌‌‌లు పెడుతున్నారని ఢిల్లీ పోలీస్‌ ‌‌‌‌‌‌‌సైబర్‌ ‌‌‌‌‌‌‌వింగ్ కు కంప్లయింట్ చేశారు.దీంతో ఈ వివాదం దుమారం రేపగా అసెంబ్లీ కమిటీ వేసింది . ఢిల్లీ అసెంబ్లీ శాంతి మరియు సామరస్యపూర్వక కమిటీ సెప్టెంబర్ 15వ తేదీన అసెంబ్లీ ముందు హాజరు కావాలని, ఈ విషయంపై వివరణ అందించాలని ఫేస్ బుక్ కు సమన్లు జారీ చేసింది.

English summary
The Delhi Assembly’s peace and harmony committee has summoned Facebook India vice-president and managing director Ajit Mohan in connection with complaints about the social media company’s alleged “deliberate and intentional inaction to contain hateful content” in the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X