దేశ రాజధానిలో దారుణం: ఇంటి ఎదుటే బీజేపీ నేత జీతూ చౌదరిని కాల్చి చంపిన దుండగులు

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీలోని మయూర్ విహార్‌కు చెందిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడు జీతు చౌదరిని దుండగులు కాల్చి చంపారు. ఆయన ఇంటి బయట బుధవారం రాత్రి 8 గంటల సమయంలో కాల్పులు జరిగినట్లు చెబుతున్నారు. కాల్పులకు గల కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.

నివేదికల ప్రకారం.. బీజేపీ నాయకుడు జీతూను ఇద్దరు దుండగులు కాల్చి చంపారు. మూలాల ప్రకారం.. నాయకుడిని మయూర్ విహార్‌కు పిలిచారు, అక్కడ దుండగులు 6 సార్లు కాల్చి చంపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 Delhi BJP Leader Jeetu Chaudhary From Mayur Vihar, Shot Dead

క్రూరమైన హత్య జరిగిన కొద్దిసేపటికే... బీజేపీ నేత నవీన్ కుమార్ జిందాల్ ట్విట్టర్‌లో బీజేపీ నాయకుడిని ఇద్దరు దుండగులు విచక్షణారహితంగా కాల్చి చంపారని తెలియజేశారు. జీతూ చౌదరి మృతికి సంతాపం తెలిపారు. అంతేకాకుండా, హంతకులను వీలైనంత త్వరగా అరెస్టు చేయాలని ఢిల్లీ పోలీసులను కోరారు.

ఇప్పటికే దేశ రాజధానిలో శోభయాత్రపై రాళ్ల రువ్వడంతో మొదలైన ఘర్షణ వాతావరణం.. నిందితుల ఆక్రమణలను తొలగింపుతో మరింత ఉద్రిక్తతకు దారితీసింది. తాజాగా, బీజేపీ నేతను దుండగులు కాల్చివేయడంతో మరోసారి ఢిల్లీలో వాతావరణం ఉద్రిక్తంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+