కాబోయే సీఎంకు జ్వరం ఇంకా తగ్గలేదు, 'ఇష్టపూర్వకంగానే తప్పుకున్నా'
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, కాబోయే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. గత నాలుగు రోజులుగా అరవింద్ కేజ్రీవాల్‌ను జ్వరం వచ్చిన సంగతి తెలిసిందే. అంత జ్వరంలోనే ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని, ప్రధానమంత్రి నరేంద్రమోదీని, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, వెంకయ్య నాయుడు తదితరులను గత రెండు మూడు రోజులుగా కలుస్తూ ఉన్నారు.
శుక్రవారం రెండు మూడు సమావేశాలకు హాజరయ్యేందుకు ప్రయత్నించినా.. ఆయన కూర్చోలేకపోయారు. దాంతో సమావేశాలను రద్దుచేసుకున్నట్లు ఆప్ నేత ఒకరు మీడియాతో తెలిపారు. ఎన్నికల ఫలితాల అనంతరం మంగళవారం నాడు నిర్వహించిన విజయోత్సవ సంబరాలను కూడా సగంలోనే వదిలేసి, జ్వరం కారణంగా కౌశాంబిలోని తన ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే.

ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసేందుకు కేవలం ఒక్క రోజే గడువు ఉండటంతో ఆప్ నేతలు అరవింద్ కేజ్రీవాల్ తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. కేజ్రీవాల్‌కు గొంతునొప్పి కూడా తీవ్రంగా ఉండటంతో మాట్లాడటం కూడా కష్టంగా ఉందని తెలిపారు.
ఇష్టపూర్వకంగానే తప్పుకున్నా: సోమనాథ్ భారతి
అరవిందే కేజ్రీవాల్ కేబినెట్ నుంచి తాను ఇష్టంగానే తప్పుకున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ నేత సోమనాథ్ భారతి తెలిపారు. తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడంపైనే దృష్టి కేంద్రీకరిస్తానని ఆయన పేర్కొన్నారు. అందుకే ఢిల్లీ కొత్త ప్రభుత్వ కేబినెట్‌లో ఇష్టంగానే తాను ఉండటం లేదని పేర్కొన్నారు. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు భారతి మంత్రిగా పనిచేశారు.












Click it and Unblock the Notifications