Viral Video: దీపావళి బోనస్ అంటే ఇలా ఉండాలి.. గిఫ్ట్ చూసి షాకైన నెటిజన్లు!

దీపావళి పండుగ వచ్చిందంటే చాలు.. చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు స్వీట్ బాక్సులు, టపాసులు లేదా సోన్ పాపిడీ ప్యాకెట్లు ఇవ్వడం సాధారమే. కానీ ఢిల్లీలోని ఓ ప్రైవేట్ సంస్థ మాత్రం తమ సిబ్బందికి ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చింది. దీపావళి కానుకగా ఏకంగా ప్రతి ఉద్యోగికి సరికొత్త 'ఐఫోన్ 16' స్మార్ట్‌ఫోన్‌ను బహుమతిగా ఇచ్చి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

దీపావళి వేళ.. బిగ్ షాక్: భారీగా పెరిగిన అమూల్ రేట్లు
దీపావళి వేళ.. బిగ్ షాక్: భారీగా పెరిగిన అమూల్ రేట్లు

డెస్కులపై ఐఫోన్లు.. ఆనందంలో ఉద్యోగులు
ఢిల్లీలోని రోహిణి ప్రాంతానికి చెందిన ఆ కంపెనీ తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వేడుకలకు సంబంధించిన 15 సెకన్ల వీడియోను పంచుకుంది. ఆ వీడియోలో ఆఫీసులోని ప్రతి ఉద్యోగి కంప్యూటర్ డెస్క్‌పై ఓ కొత్త ఐఫోన్ 16 బాక్సును అందమైన రిబ్బన్‌తో అలంకరించి ఉంచారు. వైట్, గ్రీన్, బ్రూ, బ్లాక్ వంటి విభిన్న రంగుల్లో ఉన్న ఐఫోన్లను చూసి ఉద్యోగులు.. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు ఆశ్చర్యంతో ఎగిరి గంతేసినంత పని చేశారు. "మాకు ఏ పోటీ లేదు.. మరి మీకు పండుగకు ఏం లభించింది?" అనే క్యాప్షన్‌తో కంపెనీ ఈ వీడియోను పోస్ట్ చేయడంతో ఇది క్షణాల్లోనే నెట్టింట వైరల్‌గా మారింది.

Delhi Company Diwali Gift Surprise iPhone 16 Gifted to Employees for Diwali Video Goes Viral

నెటిజన్ల ఆశ్చర్యం.. సోన్ పాపిడీ మీమ్స్ హల్చల్!
ఈ వీడియో చూసిన నెటిజన్లు సదరు కంపెనీ యాజమాన్యం చూపిన ఉదారతపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే కొందరు నెటిజన్లు ఈ వీడియో నిజమేనా లేక ఏఐతో క్రియేట్ చేశారా అని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై కంపెనీ స్పందిస్తూ.. ఇది ఎలాంటి ఏఐ వీడియో కాదని, నిజంగానే ఇచ్చామని నవ్వుతూ సమాధానమిచ్చింది.

దీపావళి తర్వాత బుధుడి ఉదయం.. ఈ రాశుల వారికి సువర్ణ కాలం!
దీపావళి తర్వాత బుధుడి ఉదయం.. ఈ రాశుల వారికి సువర్ణ కాలం!

నెటిజన్ల ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఈ వీడియో కింద నెటిజన్లు ఇంట్రెస్టింగ్ కామెంట్లు పెడుతున్నారు. "మీ ఆఫీస్‌లో ఏమైనా జాబ్స్ ఖాళీగా ఉన్నాయా? వెంటనే జాయిన్ అవుతాం" అని కొందరు కామెంట్ చేయగా.. "ఇలాంటి గిఫ్ట్ వీడియోలు చూసి ఈర్ష్య పడటం కంటే పండుగ రోజుల్లో ఇన్‌స్టాగ్రామ్ వాడటం ఆపేయడం మంచిది" అని మరొకరు సరదాగా రాసుకొచ్చారు. "మా కంపెనీ వాళ్లు కనీసం ఓ చిన్న సోన్ పాపిడీ బాక్స్ కూడా ఇవ్వలేదు, మీరు ఐఫోన్లు ఇస్తున్నారు!" అంటూ మరికొందరు తమ బాధను మీమ్స్ రూపంలో వెళ్లగక్కారు. ఏదేమైనా ఉద్యోగుల శ్రమను గుర్తించి ఇలాంటి ఖరీదైన కానుకలు ఇవ్వడం పట్ల నెటిజన్లు సదరు ఢిల్లీ కంపెనీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+