బాలయ్య మంచితనం కూడా అంత చులకనైపోయింది.. ఏం చేస్తాం?

నందమూరి బాలకృష్ణను, తెలుగు చలనచిత్ర పరిశ్రమను చులకన చేసేలా నటి రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. అవకాశాలు ఉన్నప్పుడు ఆకాశానికెత్తి, కెరీర్ మారిన తర్వాత అదే ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడటం ఆమె "ద్వంద్వ వైఖరి" కి నిదర్శనమంటూ నెటిజన్లు, బాలయ్య అభిమానులు మండిపడుతున్నారు.

బాలకృష్ణ - నాగార్జున కలిసి నటించిన ఏకైక సినిమా
బాలకృష్ణ - నాగార్జున కలిసి నటించిన ఏకైక సినిమా

ఎంతో బాగా చూసుకున్నారు..

తన తాజా వెబ్ సిరీస్ 'అక్క' ప్రమోషన్ల ఇంటర్వ్యూలో రాధికా ఆప్టే సౌత్ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె నేరుగా ఎవరి పేరు చెప్పనప్పటికీ.. తన కంటే పెద్ద వయసున్న స్టార్ హీరోతో రొమాన్స్ చేయడం, మేనమామను పెళ్లి చేసుకునే సీన్లు, కథ మధ్యలోనే తన పాత్ర ముగిసిపోవడం వంటి విషయాలను పంచుకున్నారు. ఈ వివరాలన్నీ 2014లో బాలకృష్ణ నటించిన 'లెజెండ్' సినిమాకే వర్తిస్తుండటంతో, ఆమె టార్గెట్ చేసింది బాలయ్యనే అని స్పష్టమవుతోంది. ఆరోజు అవకాశాలు సరిగా లేవు.. బాలయ్య పక్కన జోడి బాగానే ఉంటుంది.. రెమ్యునరేషన్ కూడా భారీగా ఇస్తారు.. టాలీవుడ్ బాగా చూసుకుంటుంది.. షూటింగ్ టైంలో అందరూ రాధికా ఆప్టేను బాగా గౌరవించారు.

Balakrishna Goodness Is Being Misunderstood What Can He Do Now

విమానం టికెట్లు ఇచ్చారు.. హోటల్ రూం ఖరీదైనది ఇచ్చారు. ఇంత బాగా చూసుకుంటే, అప్పుడు ఆనందపడి, భారీగా డబ్బులు మూటకట్టుకొని వెళ్లిపోయి, తెలుగు స్టార్ హీరో, అగ్ర కథనాయకుడు అన్న గౌరవం లేకుండా అహంకారపూరితంగా మాట్లాడటం ఆమె మనస్తత్వాన్ని తెలియజేస్తోంది. హీరో ఓకే అంటేనే హీరోయిన్ ఛాన్స్. ఆ విషయం తెలిసి కూడా ఇలా మాట్లాడేవారిని ఏ కేటగిరి కింద లెక్కకట్టాలో అభిమానులే తేల్చుకోవాలి.

నాగార్జునకు బాగా నచ్చిన బాలకృష్ణ సినిమా
నాగార్జునకు బాగా నచ్చిన బాలకృష్ణ సినిమా

పాత ఇంటర్వ్యూలతో కౌంటర్

ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. 'లెజెండ్' విడుదల సమయంలో బాలకృష్ణను "ఎంతో వినమ్రత గల వ్యక్తి " అని పొగిడిన రాధికా ఆప్టే పాత ఇంటర్వ్యూ వీడియోలను నెటిజన్లు బయటకు తీస్తున్నారు. నాడు పొగిడి, ఇప్పుడు హిందీ మీడియా వేదికలపై అదే అనుభవాన్ని చేదు జ్ఞాపకంగా చిత్రీకరించడం ఆమె సంస్కారానికే తగదని విమర్శిస్తున్నారు. కథ నచ్చనప్పుడు లేదా ఇబ్బంది అనిపించినప్పుడు అప్పుడే ఆ ప్రాజెక్ట్‌ను ఎందుకు తిరస్కరించలేదని, భారీ రెమ్యునరేషన్ తీసుకుని సినిమా పూర్తయ్యాక ఇప్పుడు 'పితృస్వామ్యం' అంటూ ముద్ర వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.

నిర్మాత SKN ఘాటు స్పందన

ఈ వివాదంపై టాలీవుడ్ ప్రముఖ నిర్మాత SKN (శ్రీనివాస కుమార్) ఎక్స్ వేదికగా స్పందిస్తూ గట్టి కౌంటర్ ఇచ్చారు. 'సెలెక్టివ్ విమర్శలు, సాంస్కృతిక ఆధిక్యత ప్రదర్శించడం సరికాదు. మీకు గుర్తింపునిచ్చిన ఇండస్ట్రీని గౌరవించడం నేర్చుకోండి. మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి' అన్నారు. ఒక వ్యక్తిగత అనుభవాన్ని బేస్ చేసుకుని మొత్తం తెలుగు సినీ రంగాన్ని, సీనియర్ నటుడైన బాలకృష్ణను చులకన చేస్తూ మాట్లాడటం సరికాదని, రాధికా ఆప్టే తన వ్యాఖ్యలను విరమించుకోవాలని పరిశ్రమ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+