టార్గెట్ అమెరికన్స్.. హైదరాబాద్ కేంద్రంగా రూ.261 కోట్ల సైబర్ దోపిడీ!
హైదరాబాద్ కేంద్రంగా భారీ సైబర్ ఫ్రాడ్ జరిగింది. హైదరాబాద్ కు అనుసంధానమైన అంతర్జాతీయ కాల్ సెంటర్ స్కామ్ నెట్వర్క్ దాదాపు 20లక్షల మంది అమెరికన్లను లక్ష్యంగా చేసుకుని రూ.261 కోట్లు మోసం చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వెల్లడించింది. చాలా మంది వృద్ధులను లక్ష్యంగా చేసుకుని నకిలీ అమెరికా ప్రభుత్వ అధికారుల పేరిట బెదిరించి డబ్బు, బంగారం వసూలు చేశారు. ఈ కేసులో మరో నలుగురు ఆరోపితులను ఈడీ అరెస్టు చేసింది.
జూలై 2025 నుంచి సెప్టెంబర్ 2026 మధ్య 927 ఆమోదిత కలెక్షన్ల ద్వారా సుమారు రూ.261 కోట్లు వసూలు చేశారని ఈడీ తెలిపింది. మాదాపూర్‌లోని కాల్ సెంటర్ కేసు నుంచి ప్రారంభమైన దర్యాప్తు చండీగఢ్, పాటియాలా, పూణేలోని కాల్ సెంటర్ల వరకు విస్తరించింది. ఈ నెట్వర్క్ భారత్, అమెరికా, దుబాయ్, హాంకాంగ్‌లను కలిపి పనిచేసింది.ఆరోపితులు దాదాపు 20 లక్షల అమెరికన్ ఫోన్ నంబర్లు, పేర్లు, చిరునామాలు, వయసులు గల డేటాబేస్లను సేకరించారు.

ఈ సమాచారం డార్క్ వెబ్ నుంచి వచ్చినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. జర్మనీ, ఫిన్లాండ్లోని సర్వర్లపై ఆటో-డయలర్లు ఏర్పాటు చేసి కాల్స్ చేశారు. కాలర్లు డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ (DEA), జస్టిస్ డిపార్ట్మెంట్, ఫెడరల్ ట్రేడ్ కమిషన్, ట్రెజరీ డిపార్ట్మెంట్ అధికారులుగా నటించి అరెస్టు, ఆస్తుల స్వాధీనం బెదిరింపులు చేశారు.బాధితుల ఇళ్ల నుంచి నేరుగా నగదు, బంగారం తీసుకునే ఓవర్సీస్ కలెక్షన్ నెట్వర్క్ కూడా పనిచేసింది.
డబ్బును క్రిప్టోకరెన్సీ, మ్యూల్ అకౌంట్లు, హవాలా ద్వారా భారత్‌కు తరలించారు. ఆస్తులు, బంగారం, వాహనాలు, వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టారు. ఇప్పటివరకు 549 మంది అమెరికన్ బాధితులను గుర్తించారు. 6,463 యూఎస్ నంబర్లకు కాల్స్ లేదా మెసేజ్‌లు పంపినట్లు తేలింది.తాజాగా హర్షిల్ నయన్భాయ్ రావల్, జస్వంత్ సింగ్, చేతన్ ముంజల్, ప్రణవ్ పిఠాడియాలను అరెస్టు చేశారు.
ఇంతకు ముందు వికాస్ నిమార్, తారాచంద్ నిమార్, మొహమ్మద్ ఇర్ఫాన్ అన్సారీలను అరెస్టు చేసి చంచల్‌గూడ జైలులో ఉంచారు. మొత్తం ఏడుగురు ఆరోపితులు అరెస్టయ్యారు.ఈ స్కామ్‌లో నకిలీ ఐడీ కార్డులు, బ్యాడ్జ్‌లు, సీజర్ నోటీసులు, కోర్టు ఆర్డర్లు వంటి పత్రాలు కూడా ఉపయోగించారు. బాధితుల ఐడెంటిటీ థెఫ్ట్, బ్యాంక్ అకౌంట్ తీసుకోవడం కూడా జరిగింది.
ఈడీ డిజిటల్ ఎవిడెన్స్, వాట్సాప్ గ్రూప్‌లు, లెడ్జర్లు, క్రిప్టో వాలెట్లను స్వాధీనం చేసుకుంది.ఇటువంటి అంతర్జాతీయ సైబర్ మోసాలు వృద్ధులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అమెరికా ఎఫ్‌బీఐ కూడా ఈ కేసులో సమాచారం పంచుకుంది. ఈడీ విచారణ కొనసాగుతోంది. ఇలాంటి నెట్‌వర్క్‌లను అరికట్టేందుకు అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.













Click it and Unblock the Notifications
