Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అదానీ సంస్థలపై ఆ వార్తలు ప్రచురించొద్దు.. దిల్లీ కోర్టు ఆదేశాలు

అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (AEL)కు దిల్లీ కోర్టు నుంచి బిగ్ రిలీఫ్ దొరికింది. అదానీ కంపెనీపై ధృవీకరించని, పరువు నష్టం కలిగించే వార్తా కథనాలను ప్రచురించకుండా జర్నలిస్టులు, రిపోర్టర్లపై కోర్టు నిషేధం విధించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో, పరువు నష్టం కలిగించే వార్తా కథనాలు, సోషల్ మీడియా పోస్ట్‌ లను తొలగించాలని ఈ మేరకు జర్నలిస్టులను, విదేశీ ఎన్‌ జీఓలను దిల్లీ కోర్టు ఆదేశించింది.

అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ కంపెనీకి దిల్లీ హైకోర్టులో భారీ ఉపశమనం లభించింది. అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌ సంస్థకు వ్యతిరేకంగా పరువు నష్టం కలిగించే విధంగా వార్తలను ప్రచురించకుండా రిపోర్టర్లు, జర్నలిస్టులు, ఇతర వ్యక్తులపై దిల్లీ కోర్టు ఆంక్షలు విధించింది. సీనియర్ సివిల్ జడ్జి అనుజ్ కుమార్ సింగ్ ఈ కేసును విచారించారు.

అదానీ గ్రూప్ ప్రతిష్టను దెబ్బతీయడానికి, సంస్థ అంతర్జాతీయ కార్యకలాపాలకు ఆటంకం కలిగించడానికి paranjoy.in, adaniwatch.org, Adanifiles.com.au వంటి వెబ్‌ సైట్‌ లలో, సంబంధిత పోస్టులు, వీడియోలతో డిఫమేటరీ ప్రచురణలు జరుగుతున్నాయని అదానీ గ్రూప్ ఆరోపించింది. ఈ కేసులో ప్రతివాదులుగా పరంజోయ్ గుహ ఠాకుర్తా, రవి నాయర్, అభిర్ దాస్‌ గుప్తా, ఆయుష్ జోషి, బాబ్ బ్రౌన్ ఫౌండేషన్, డ్రీమ్‌ స్కేప్ నెట్‌ వర్క్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, గెటప్ లిమిటెడ్, డొమైన్ డైరెక్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్, జాన్ డోయ్ తదితర ఉన్నారు.

అదానీ సంస్థలపై నిరంతరం ఫార్వార్డింగ్, పబ్లిషింగ్, రీ-ట్వీటింగ్, ట్రోలింగ్ వల్ల కంపెనీ ప్రతిష్ట మరింత దెబ్బతింటుంది.. అలాగే ఇది మీడియాపై విచారణకూ దారితీయవచ్చని కోర్టు పేర్కొంది. తదుపరి విచారణ జరిగే వరకు, కంపెనీ ప్రతిష్టను దెబ్బతీసేలా ధృవీకరించని, నిరాధారమైన నివేదికలను ప్రచురించడం, పంపిణీ చేయడం లేదా ప్రచారం చేయకుండా ప్రతివాదులను కోర్టు ఆదేశించింది.

Delhi Court Grants Major Relief to Adani Enterprises Bans Unverified Defamatory News

తక్షణమే అలాంటి పరువు నష్టం కలిగించే కథనాలను తొలగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అది సాధ్యం కాకపోతే, ఈ ఉత్తర్వు జారీ అయిన ఐదు రోజులలోపు వాటిని తొలగించాలని కోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ వాళ్లు ఆ వార్తలను తొలగించడం సాధ్యం కాకపోతే గూగుల్, యూ ట్యూబ్, ఎక్స్ సంస్థలు ఆ కంటెంట్ ను 36 గంటల్లోపు తొలగించాలని లేదా వాటికి యాక్సెస్‌ ను నిలిపివేయాలని దిల్లీ కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ కోసం ఈ కేసును అక్టోబరు 9కి వాయిదా వేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+