దిశా రవికి బెయిల్ ఇస్తూ హైకోర్టు కీలక వ్యాఖ్యలు- పోలీసులకు అక్షింతలు
రైతుల నిరసనలు ఎలా చేయాలో వివరిస్తూ టూల్‌కిట్ రూపొందించి దాన్ని వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న పర్యావరణ ఉద్యమకారిణి దిశా రవికి ఇవాళ ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది. ఆమెపై ఢిల్లీ పోలీసులు మోపిన ఆరోపణలు శిక్షార్హమైనవి కాదని పేర్కొన్న కోర్టు దిశా రవికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో పది రోజుల క్రితం అరెస్టైన ఆమెకు భారీ ఊరట లభించింది.
అయితే బెయిల్ మంజూరు సందర్భంగా ఢిల్లీ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
నిషేధిత సిక్కు సంస్ధ పోయెటిక్ జస్టిస్ ఫౌండేషన్‌తో కుమ్మక్కై రైతు ఆందోళనలను ప్రోత్సహించేందుకు పర్యావరణ ఉద్యమకారిణి దిశా రవి ప్రయత్నించారని, టూల్‌కిట్ పేరుతో ఉద్యమ వ్యూహాన్ని తయారు చేయడంతో పాటు దాన్ని వాట్సాప్‌లో షేర్ చేశారని ఆమెపై అభియోగాలు మోపారు. దీంతో ఆమెకు బెయిల్ ఇవ్వొద్దని వాదించారు. అయితే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం, టూల్‌కిట్ డాక్యుమెంట్‌కు ఎడిటర్‌గా ఉండటం శిక్షార్హమైన నేరాలు కావని ఢిల్లీ కోర్టు వారికి స్పష్టం చేసింది.

22 ఏళ్ల దిశా రవిని బెయిల్ తిరస్కరించడానికి తమకు తగిన స్పష్టమైన కారణాలు కనిపించడం లేదని ఢిల్లీ కోర్టు తీర్పు సందర్భఁగా స్పష్టం చేసింది. సిక్కు సంస్ధలతో దిశా రవికి సంబంధాలు ఉన్నట్లు నిరూపించే ఆధారాలు ఒక్కటి కూడా లేదని ఢిల్లీ పోలీసుల తీరుపై ఆక్షేపణ తెలిపింది. రైతు ఆందోళన కోసం ఆమె వ్యూహం రచించినట్లు నిరూపించే ఆధారాలు కూడా లేవని తెలిపింది. ఊహాజనితమైన విషయాల ఆధారంగా వ్యక్తుల స్వేచ్ఛను హరించే అధికారం పోలీసులకు లేదని స్పష్టం చేసింది.
-
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..











Click it and Unblock the Notifications