ఎస్సైతో ఢిల్లీ సీపీ భేటీ.. హెల్త్ గురించి అడిగి తెలుసుకున్న పోలీస్ బాస్
హనుమాన్ జయంతి సందర్భంగా జరిగిన ర్యాలీలో దేశ రాజధాని ఢిల్లీలో హింసాత్మక ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు కూడా గాయపడ్డారు. ఎస్సై మేదా లాల్ మీనాను పోలీస్ కమిషనర్ పరామర్శించారు. ఇంటికెళ్లి మరీ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. నిన్న జరిగిన ర్యాలీలో ఎస్సై గాయపడ్డ సంగతి తెలిసిందే.

మరోవైపు ఇవాళ ఉత్తమ్ నగర్‌లో ఢిల్లీ పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు. నిన్నటి ఘటన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా పెట్రోలింగ్ చేశారు. మరోవైపు జహింగిరి పూర్ ఘటనతో సంబంధం ఉన్న మరో ఇద్దరిని రోహిణి కోర్టు ఒకరోజు పోలీస్ కస్టడీకి ఇచ్చింది. మరో 12 మందిని జ్యుడిషీయల్ కస్టడీకి అప్పగించారు. ఢిల్లీ ఘటన హిందు అనుకూల గ్రూపులు ఆందోళనకు దిగుతున్నాయి. పంచకులలో భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. నినాదాలు చేస్తూ ముందుకు సాగారు.
ఢిల్లీలో జరిగిన హనుమాన్ జయంతి ర్యాలీలో హింస చెలరేగింది. కొంతమంది పోలీసులకు గాయాలు కాగా, కొన్ని వాహనాలకు నిప్పు పెట్టారు. జహంగీర్ పూరి ప్రాంతంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ హింసకు దారితీసింది. ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘర్షణలో పలువురు పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయి. ఒక్కసారిగా హింస చెలరేగడంతో ఈ ప్రాంతంలో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. జహంగీర్ పూరి ప్రాంతంలో భారీగా పోలీసులను మొహరించారు. రెండు వర్గాల మధ్య హింస చెలరేగిందని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications