మారుతున్న లెక్కలు, ఉత్కంఠ - ఫలితం మారేనా..!!
Delhi Assembly Election Results 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠగా మారు తోంది. బీజేపీ అధికారం ఖాయమని భావిస్తున్న వేళ క్లోజ్ ఫైల్ కనిపిస్తోంది. ప్రస్తుతం బీజేపీ 42 స్థానాల్లో ఆధిక్యత లో ఉండగా.. ఆప్ 28 స్థానాల్లో లీడ్ లో ఉంది. మేజిక్ ఫిగర్ 36 సీట్ల కంటే బీజేపీ మరో ఆరు స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. అదే సమయంలో ఆప్ కు సైతం మరో ఎనిమిది స్థానాలు కావాల్సి ఉంది. కాగా, ప్రస్తుతం ఈ రెండు పార్టీల మధ్య 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3 వేల ఓట్ల ఆధిక్యత నువ్వా - నేనా అన్నట్లుగా మారుతోంది. దీంతో, తుది ఫలితం ఉత్కంఠ పెంచుతోంది.
పెరుగుతున్న ఉత్కంఠ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తి కర ఫలితాలు వెల్లడి అవుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్ నుంచి బీజేపీ పూర్తి ఆధిక్యత కనిపించింది. దీంతో, ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజం అవుతాయని భావించారు. కానీ, కౌంటింగ్ కొనసాగుతున్న కొద్దీ లెక్కలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. పలు నియోజకవర్గాల్లో పోటీ నువ్వా నేనా అన్నట్లుగా మారుతోంది. కేజ్రీవాల్ పోటీ చేస్తున్న న్యూఢిల్లీ అసెంబ్లీ సెగ్మెంట్ లో రౌండ్ రౌండ్ కు ఫలితం మారుతోంది. ప్రస్తుతం ఇక్కడ కేజ్రీవాల్ పైన బీజేపీ అభ్యర్ది పర్వేశ్ సాహెబ్ సింగ్ పోటీ చేస్తున్నారు. 6 రౌండ్లు పూర్తియిన తరువాత కేజ్రీవాల్ 225 ఓట్ల వెనుకంజలో కొనసాగుతున్నారు.

మారుతున్న లెక్కలు
ఈ నియోజకవర్గంలో ఇంకా ఏడు రౌండ్లు మిగిలి ఉంది. అయితే, తొలుత వెనుకంజలో ఉన్న సిసోడియా 2,345 ఓట్ల మెజార్టీ తో గెలుపు దిశగా వెళ్తున్నారు. ఢిల్లీలోని 70 అసెంబ్లీ నియోజక వర్గాల్లో 36 సీట్లు దక్కించుకుంటే అధికారం ఖాయం అవుతుంది. ఇప్పటికే బీజేపీ 42 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యతలో కొనసాగుతోంది. కానీ, క్రమేణా ఆప్ కూడా పుంజుకోవటంతో మిగిలిన రౌండ్ల లెక్కింపు పైన ఉత్కంఠ పెరుగుతోంది. 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ - ఆప్ మధ్య కేవలం మూడు వేల గ్యాప్ కనిపిస్తోంది. బీజేపీ ఆరు స్థానాలు తగ్గినా.. ఆప్ ఆరు స్థానాలు పెరిగినా తుది ఫలితం మారిపోయే అవకాశం కనిపిస్తోంది.
14 నియోజకవర్గాలే కీలకం
దీంతో, ఇప్పుడు ఈ 14 నియోజకవర్గాల్లో కౌంటింగ్ పైన ఆసక్తి పెరుగుతోంది. ప్రతీ రౌండ్ లోనూ ఈ నియోజకవర్గాల్లో ఆధిక్యతల్లో మార్పు కనిపిస్తోంది. బీజేపీ నేతలు మాత్రం తమ విజయం ఖాయం అయిందని ధీమాగా ఉన్నారు. ఆప్ నేతలు ఇంకా లెక్క పూర్తి కాలేదని.. తదుపరి రౌండ్లలో తాము పుంజుకోవటం ఖాయమని ఇంకా ఆశాభావంతో కనిపిస్తున్నారు. ఇప్పటి వరకు వెల్లడవుతున్న ఫలి తాల ఆధారంగా బీజేపీ 48 శాతం ఓట్ షేర్ దక్కించుకోగా, ఆప్ 43 శాతం ఓటింగ్ చేజిక్కుంచు కుంది. కాగా, కాంగ్రెస్ కేవలం 6.7 ఓటింగ్ రావటం ఇప్పుడు సంచలనంగా మారుతోంది. దీంతో, బీజేపీ అధికారం ఖాయంగా కనిపిస్తున్నా..తుది రౌండ్లలో లెక్కలు మారుతాయనే ఆశతో ఆప్ నేతలు కనిపిస్తున్నారు. దీంతో, చివరి రౌండ్ల లెక్కింపు పైన ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications