ఢిల్లీలో కాల్పుల కలకలం: దుండగుల కాల్పుల్లో ఇద్దరు మృతి, మరో ఇద్దరికి తీవ్రగాయాలు
న్యూఢిల్లీ: ఢిల్లీలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఢిల్లీలోని బడా హిందూ ఆస్పత్రి సమీపంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు.
గుర్తుతెలియని వ్యక్తులు సుమారు 20-25 రౌండ్ల కాల్పులు జరిపారు. గురువారం రాత్రి 9.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తీవ్రగాయాలపాలైన బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

తుపాకులతో గుంపుగా వచ్చిన దుండగులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
Recommended Video
కాగా, తనను, తన మామను లక్ష్యంగా చేసుకుని దుండగులు దాడి చేసినట్లు మొహమ్మద్ మునిబ్ అనే వ్యక్తి తెలిపాడు. కాల్పులు జరపడానికి ముందు, దుండగులలో ఒకరు తన మామ నడుపుతున్న స్థానిక ఆసుపత్రిలో కరోనావైరస్ టీకా డ్రైవ్ గురించి ఆరా తీసినట్లు ఇండియా టుడేకు తెలిపాడు. ఈ కాల్పుల ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications